బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 78 రోజులు పూర్తి చేసుకుంది. నిన్నటి ఎపిసోడ్లో సోనియా.. ప్రేరణ, నిఖిల్‌ను నామినేట్ చేయగా ఆ తర్వాత శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చి అందరినీ నవ్వుతూ పలకరించాడు. ప్రేరణ, యష్మీని నామినేట్ చేశాడు బాషా. ప్రేరణను నామినేట్ చేస్తూ నువ్వు, యష్మీ అంటే నాకు ఎంత ఇష్టమైనా కూడా మీరు ఫిజికల్ వయలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు చేయద్దని నేను చెప్పింది మీకు గుర్తుండే ఉంటుంది.. అప్పుడు వాళ్ల ఇష్టం అని మీరు అనేవారు అని సలహా ఇచ్చాడు. పానిపట్ గేమ్‌లో నిఖిల్ మీ ఇద్దరినీ రఫ్‌గా హ్యాండిల్ చేశాడని.. నువ్వు బూతు కూడా వాడావ్.. నిజానికి నాకు అలా ఏం అనిపించలేదు అని చెప్పాడు.
యష్మీని నామినేట్ చేస్తూ నీలో గ్రూపిజం అనేది కనిపిస్తుందని చెప్పాడు. అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్‌ని నామినేట్ చేశాడు. అప్పడు నిఖిల్ కూడా లైట్ తీసుకున్నాడు. కానీ నీకెందుకు పెయిన్ అయింది చెప్పాలన్నాడు. ఫ్రెండ్ అయినా ప్రేరణను నామినేట్ చేస్తా అన్నావ్ కదా అంటూ శేఖర్ అడిగితే అవును అన్నా అంటూ యష్మీ అంది. మరి ఇప్పటివరకూ ఎందుకు ప్రేరణను చేయలేదు అని ప్రశ్నించాడు.
తర్వాత బేబక్క హౌస్‌లోకి ఎంటరైంది. వచ్చీ రాగానే ఫస్ట్ నామినేషన్ పృథ్వీకి వేసింది. మీ దృష్టిలో ఫిట్‌గా ఉంటేనే గేమ్ బాగా ఆడినట్లు.. కానీ బిగ్‌బాస్‌లో గేమ్ ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఉంటాయి అని తెలిపింది. తర్వాత తన రెండో నామినేషన్ నిఖిల్‌కి వేసింది బేబక్క.స్ట్రాంగ్ కంటెస్టెంట్ చీఫ్ అయితే బావుంటుంది.. వాళ్ల దగ్గర ఓ విజన్ ఉంటుందని నీ టీమ్‌లో చేరా నేను.. కానీ నువ్వు మా కంటే సోనియాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చావ్ అని తెలిపింది.
Also Read:కేసీఆర్ పేరుతో సినిమా గొప్ప విషయం: హరీశ్