Bigg Boss 8 Telugu: భర్తతో ప్రేరణ ముద్దుల వర్షం

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 75 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో ప్రేరణ భర్త హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలుత ప్రేరణను శ్రీపాద కటౌట్‌ని స్టోర్ రూంలో పెట్టమని అనౌన్స్‌మెంట్ ఇచ్చి డ్రామా క్రియేట్ చేశారు. ఇక తేజా వాళ్ల మదర్‌ని హౌస్‌లోకి పంపించండి బిగ్ బాస్ అని అవినాష్‌తో పాటు.. మిగిలిన హౌస్ మేట్స్ రిక్వెస్ట్ చేశారు.

గార్డెన్ ఏరియా మొత్తాన్ని లవ్ సింబల్స్‌తో నింపేసి.. బిగ్ బాస్ హౌస్‌ని రొమాంటిక్‌గా మార్చేశారు. ఈ సెటప్ అంతా తన కోసమే అని అనుకున్న ప్రేరణ.. క్షణంలో డ్రెస్ మార్చుకుని వచ్చేసింది. ఇంతలో శ్రీపాద ఎంట్రీ ఇవ్వడంతో పరుగు పరుగున వెళ్లి ఎగిరి మరీ తన భర్తని హగ్ చేసుకుంది ప్రేరణ. వీళ్ల రొమాన్స్‌ని చూసి యష్మీ గౌడ తెగ ఫీల్ అయిపోయింది.

రోహిణి అయితే వాళ్ల రొమాన్స్‌ని చూసి నాకు ఇలాంటి డేట్ ఎప్పుడొస్తుందో అని అన్నది తేజాని పట్టుకుని అనగా హా చేసుకుందాంలే ఆ కుర్చీలు ఖాళీ అయ్యాక అంటూ పంచ్ వేశాడు తేజా. విష్ణు ప్రియ … పృథ్వీ దగ్గరకు వెళ్లి.. తన చున్నీ తీసి పృథ్వీని ఆ ముసుగులోపలికి లాక్కుంది. రొమాంటిక్ మూడ్‌లో ప్రేరణ, శ్రీపాద.. ముద్దుల వర్షం కురిపిస్తుంటే.. వాళ్లని చూసి విష్ణు ప్రియ, యష్మీ గౌడలు తహతహలాడిపోయారు. తర్వాత అవినాష్ మెగా చీఫ్‌గా రెండోసారి ఎంపికయ్యారు. చివర్లో నాటకీయ పరిణామాలతో టేస్టీ తేజా తల్లిని హౌస్‌లోకి పంపించారు.

Also Read:దేశభక్తిని పెంపొందించే.. ‘అభినవ్’

- Advertisement -