Bigg Boss 8 Telugu: ప్రేరణకు షాక్ ఇచ్చిన శ్రీపద్!

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 74 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో హౌస్‌లోకి వచ్చారు విష్ణుప్రియ తండ్రి మోహన్. విష్ణు.. అంటూ పిలవగానే పరిగెత్తుకుంటూ బయటికొచ్చింది. తన తండ్రి హత్తుకొని ఎలా ఉన్నావ్.. నానమ్మ ఎలా ఉందంటూ అడిగింది. అనంతరం ఇంటి సభ్యులను పలకరించారు మోహన్.

అందరూ బాగా ఆడతున్నారు.. నువ్వు ఇంకా బాగా ఆడాల్రా అంటూ విష్ణుతో అన్నారు. దీనికి నాన్నా.. ఇలాంటివి ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు. . ఇప్పుడొద్దు అంటూ విష్ణు నవ్వింది. అంకుల్ నాకు ఎవరైనా పిల్లని చూడొచ్చు కదా మీ ఊరిలో అంటూ తేజ అడిగాడు. దీనికి సరే ఒక 10 పుషప్స్ తియ్.. ఖచ్చితంగా చూస్తా అంటూ విష్ణు తండ్రి అన్నారు. దీంతో తేజ చాలా కష్టపడ్డాడు కానీ పుషప్స్ తీయలేకపోయాడు. అయితే విష్ణు తండ్రి చకచకా అక్కడే 20 పుషప్స్ తీసి చూపించారు.

విష్ణు పుట్టిన తర్వాత చాలా రోజులు నేను దగ్గరికెళ్లలేకపోయా.. చాలా కారణాల వల్ల రాలేకపోయా.. మిస్ చేసుకున్నా చాలా బాధపడ్డాను.. నేను పైసా ఇవ్వలేదు.. నేను వాళ్లకి అన్యాయం చేశా ..సారీ చెబుతున్నా అన్నారు. విష్ణు కోసం ఒక గేమ్ ఆడి బర్గర్ గెలిచారు మోహన్.

తన భర్త శ్రీపద్ వస్తాడంటూ ఎదురూచూసింది ప్రేరణ. ఇంతలో టీవీలో వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్. అందులో ప్రేరణ భర్త వీడియోలో మాట్లాడారు. హై పుట్టు ఎలా ఉన్నావ్.. 2 మంత్స్ పైనే అయిపోయింది.. నువ్వు ట్రోఫీ ఎత్తినప్పుడు ఖచ్చితంగా వస్తా నేను అంటూ షాకిచ్చారు. ఇది చూసి ప్రేరణ బాగా హర్ట్ అయింది.తర్వాత స్టోర్ రూమ్ దగ్గర బెల్ మోగగా అక్కడికెళ్లి చూస్తే శ్రీపద్ నిలవెత్తు కటౌట్ అక్కడ ఉంది. దాంతో పాటు ఒక లెటర్ కూడా కనిపించింది.

Also Read:KTR:ఫార్మాసిటీ విషయంలో భంగపాటే!

- Advertisement -