Bigg Boss 8 Telugu: వారిద్దరిని దూరం పెట్టు..నిఖిల్‌కి క్లాసు

1
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 73 రోజులు పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా తాజా ఎపిసోడ్‌లో హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు నిఖిల్ తల్లి. ‘కంద’ అనే పిలుపు రాగా నిఖిల్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన కొడుకును వెనకాల నుంచి హత్తుకొని.. ఏడవకు నాన్న అంటూ పలకరించారు. తల్లి ఆప్యాయంగా హత్తుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు నిఖిల్. ఆ తర్వాత ఇంటి సభ్యులందరిని ఆప్యాయంగా పలకరించారు సులేఖ.

పృథ్వీని హత్తుకొని మై సన్ లవ్యూ అంటూ మాట్లాడారు. తర్వాత నిఖిల్‌తో ఒంటరిగా మాట్లాడారు తన తల్లి. అప్పటివరకూ అందరితో నవ్వుతూ మాట్లాడిన ఆమె తన కొడుక్కి మాత్రం సీరియస్‌గా క్లాసు పీకారు. గౌతమ్‌ తో ఫైట్‌లో ఎక్కువ డిఫెన్స్‌కి వెళ్లొద్దు.. నామినేషన్ వరకూ పోవద్దు అని చెప్పారు. తర్వాత యష్మీ టాపిక్‌ కూడా తీశారు సులేఖ. యష్మీని కొంచెం కంట్రోల్ చెయ్.. ఎమోషనల్‌గా ఉండటమే బ్యాడ్ అంటూ సలహా ఇచ్చారు. అలాగే ప్రేరణకు కూడా దూరంగా ఉండాలని ఇండైరెక్ట్‌గా సూచించారు.

తన కొడుకు కోసం తెలుగులో ఓ పాట కూడా పాడారు. నాకు తెలుగు సాంగ్ ఒకటే తెలుసు అంటూ ఎవరెవరో నీకెదురైనా.. అంటూ నాలుగు ముక్కలు పాడారు. తర్వాత బాల్స్.. గ్లాసులో వేసే గేమ్ పెట్టగా.. ఈజీగా ఆడేశారు సులేఖ. ఇందులో ఆమె గెలవడంతో ‘మటన్’ పంపించాడు బిగ్‌బాస్. ఇంతలో సులేఖ హౌస్‌లో మీకు ఇచ్చిన సమయం ముగిసింది.. ఇక మీరు వెళ్లండి అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేయగా నిఖిల్ ఏడుస్తూనే బై అమ్మ అంటూ చెప్పాడు.

Also Read:‘కుబేర’.. ఫస్ట్ గ్లింప్స్

- Advertisement -