బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 71 రోజులు పూర్తి చేసుకుంది. 11వ వారం నామినేషన్స్‌లో ఆరుగురు ఉండగా ఈ సారి నామినేషన్స్ మరింత వాడివేడిగా సాగాయి. ప్రేరణ తన వంతు రాగానే గౌతమ్‌ను నామినేట్ చేసింది . నాకు ఆయన జర్నీ అర్థం కావడం లేదు.. తన టీమ్‌లో నేను ఉన్నాను.. అప్పడు ఏమైనా సలహాలు ఇస్తే నాకు ఏం చెప్పకండి నన్ను వదిలేయండి అన్నాడు.. ఎక్కువగా కలవట్లేదు అని చెప్పగా దీనికి గౌతమ్ డిఫెండ్ చేసుకున్నాడు. నువ్వు పోట్రే అన్నావ్.. మనం బయట ప్రపంచంలో ఉన్నప్పుడు నువ్వు అన్న మాట రెండో వ్యక్తికి తెలీదు మూడో వ్యక్తికి తెలీదు.. కానీ ఒక ఫ్రెండ్‌గా నేను భరించగలుగుతా.. కానీ మనం ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాం.. ఇక్కడ మనం మాట్లాడే ప్రతి మాట ఒక బ్రాండింగ్.. నువ్వు సిగ్గులేదు అంటే నేను తీసుకోలేను.. నువ్వు పుడింగి, క్యారెక్టర్ లెస్ అన్నది నీకు నెగెటివ్ కాకపోవచ్చు అన్నాడు.
తర్వాత నిఖిల్‌కి బ్రెష్ దొరికింది. వెంటనే చకచకా లోపలికి వచ్చేసి నా నామినేషన్ అబ్వీయస్‌గా తేజ.. నేన డిస్ రెస్పెక్ట్ చేసినందుకు నన్ను నామినేట్ చేశాడు.. కానీ ఎవిక్షన్ పాస్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనోడు తప్పు చేశాడు అంటూ తేజ పెయింటింగ్‌ను పాడు చేశాడు నిఖిల్. స్మోకింగ్ జోన్‌లో స్మోక్ చేసినందుకు నువ్వు పృథ్వీని నామినేట్ చేశావ్ కదా అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి అయితే నువ్వు ఆయన కోసం నామినేట్ చేస్తున్నావా.. అంటే కలిసి ఆడుతున్నారా మీరంతా.. అంటూ తేజ పాయింట్ పట్టాడు. దీనికి నిఖిల్ చెప్పలేకపోయాడు. నువ్వు ఎలిమినేట్ అయ్యాక బయటికెళ్లి చూసుకో పేరు అంటూ తేజ అన్నాడు.
తనకి అవకాశం రాగానే యష్మీని నామినేట్ చేశాడు తేజ. అంతకంటే ముందు మా అమ్మకి సారీ చెబుతున్నా.. అనివార్య కారణాల వల్ల నిన్ను ఫ్యామిలీ వీక్‌కి తీసుకురాలేకపోతున్నా.. హౌస్‌మెట్స్ అందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను వరస్ట్ ప్లేయర్ అని ఎంపిక చేశారు అని చెప్పగా యష్మీ ఓవరాక్షన్ చేసింది. ఈ క్రమంలో తేజ – యష్మీ మధ్య పెద్ద యుద్దం జరిగింది. మొత్తంగా కన్నడ బ్యాచ్ అంతా తేజను టార్గెట్ చేశారు.
Also read:మట్కా..పక్కా మాస్ ఫిల్మ్!