Bigg Boss 8 Telugu: అవినాష్ చేసిన పనికి అంతా షాక్!

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 67 రోజులు పూర్తి చేసుకుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ముందుగా యష్మీ-విష్ణుప్రియకి ఓ టాస్కు పెట్టారు బిగ్ బాస్. చివరి చీఫ్ కంటెండర్ అయ్యేందుకు పెట్టిన ఈ టాస్కులో గెలవాలంటే బోర్డుపై ఉన్న స్క్రూలను అరేంజ్ చేసి ఒకే కలర్ ఉన్న లైన్‌లో పెట్టాలి అని చెప్పగా ఈ టాస్కులో గెలిచి యష్మీ చివరి చీఫ్ కంటెండర్ అయిపోయింది.

తర్వాత తన దగ్గరున్న బ్రీఫ్‌కేస్ ఓపెన్ చేయమని బిగ్‌బాస్ చెప్పాడు. తీరా ఓపెన్ చేస్తే అందులో రూ.75వేలు ఉన్నాయి. ఈ డబ్బుని ప్రైజ్ మనీకి యాడ్ చేస్తామని బిగ్‌బాస్ చెప్పాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే యష్మీ బ్రీఫ్‌కేసును సరదాగా గౌతమ్ దొంగతనం చేయగా పొరపాటున విష్ణుప్రియ బ్రీఫ్‌కేసును తనదనుకొని ఓపెన్ చేసింది యష్మీ.

ఈ విషయం తెలిసిన తర్వాత యష్మీ తన బ్రిఫ్ కేసు ఓపెన్ చేస్తే అందులో ఏకంగా రూ.లక్ష 80 వేలు ఉన్నాయి. దీంతో కంటెస్టెంట్లు అందరూ అవాక్కయ్యారు. తర్వాత యష్మీని పక్కకి తీసుకెళ్లి మాట్లాడింది విష్ణు. పృథ్వీ నీతో మాట్లాడుతున్నాడు.. నాతో సరిగా మాట్లాడట్లేదు.. నాకు అయితే క్లారిటీ వచ్చేసిందిరా.. ఊరికే డంబ్ అని.. ఒక వ్యక్తిని హర్ట్ చేశాడని అతనికి ఐడియా ఉండి కూడా సారీ చెప్పట్లేదు అని చెప్పింది విష్ణు. ఇంతలో పృథ్వీని పిలిచి.. ప్లీజ్ ఇద్దరినీ సారీ అడుగుతావా.. అంటూ అన్నాడు. దీనికి హే.. సారీ లేదు.. ఏం లేదు అంటూ పృథ్వీ చెప్పాడు. దీంతో నేనేం అడగలేదు సారీ.. అంటూ విష్ణు అంది, దీనికి నేను నీతో ఏమైనా మాట్లాడానా.. తనతో చెప్పాను.. అంటూ పృథ్వీ సీరియస్ అయ్యాడు.

కొంచెం సేపటి తర్వాత విష్ణు మొన్నెప్పుడో చెప్పిన డైలాగును హరితేజ దగ్గర చెప్పి ఇరికించాడు అవినాష్. వంట చేసే వాళ్లకి వేరే పని ఏముంది.. గరిటె తిప్పడమే కదా.. వాళ్లకి వేరే పనులు కూడా ఇవ్వొచ్చుగా అంటూ విష్ణు ఒకసారి అవినాష్‌తో అంది. ఆ తర్వాత పృథ్వికి సారి చెప్పింది విష్ణుప్రియ. దీని ఓకే చెప్పాడు పృథ్వీ .

Also Read:మైటా దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ నేతలు

- Advertisement -