బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 66 రోజులు పూర్తి చేసుకుంది. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత యష్మీని హగ్ చేసుకున్న నిఖిల్…ఎందుకు ఆ (గౌతమ్ అక్కా అన్నది) టాపిక్ తీశావురా వేస్ట్‌గా అంటూ అడిగాడు. నువ్వు అక్కా అన్నదే మెయిన్ నామినేషన్ పాయింట్‌గా తీసినప్పుడు.. ఎవరికైనా నిఖిల్ ఎందుకు ఆ పాయింట్ మీద చేశాడు అనే చర్చ వస్తుంది అంటూ యష్మీ ఆన్సర్ ఇచ్చింది.
ఇప్పుడు నాకు నచ్చలేదు నో అన్నప్పుడు నువ్వు ఇంక చెప్పకూడదు.. అది వాడి (గౌతమ్) తప్పు అని నిఖిల్ అనగా అవును కానీ నాకు అక్కడ మాట్లాడటానికి ఛాన్స్ రాలేదు కదా.. అందుకే నేను దాని గురించి చెప్పాలనుకున్నాను.. అంటూ యష్మీ చెప్పుకొచ్చింది.
ఇంతలో అక్కడికి వచ్చిన గౌతమ్…రేయ్ స్వాతిముత్యం మీకు అర్థం కావట్లే.. అక్కడే ఏదైతే బయట చెప్తున్నారో అదే బయట పోట్రే అవుతుంది.. మీకు అర్థం కావట్లే ఇద్దరికి సలహా ఇచ్చాడు గౌతమ్. మా గురించి ఏమీ బ్యాడ్‌గా చెప్పలేదురా వాళ్లు.. నువ్వు నీ గురించి చెప్పడం చాలా రాంగ్‌గా తీసుకుంటున్నావ్ అని గౌతమ్‌తో యష్మీ చెప్పగా సీరియస్ అయిన నిఖిల్ “జనాలు అలా అనుకుంటారు ఇలా అనుకుంటారని ఒకవేళ ఎవరికైనా థాట్ ఉంటే ఒకరితో కూడా మాట్లాడకూడదు నన్ను అడిగితే.. అనుకునే వాళ్లు వంద అనుకుంటారు.. వాటన్నింటికీ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి బతకడానికి అయితే రాలేదు ఎవరూ ఇక్కడ అంటూ కోపంగా వెళ్లిపోయాడు.
తర్వాత విష్ణుతో గౌతమ్ – యష్మీ టాపిక్ తీశాడు నికిల్. యష్మీది- గౌతమ్‌ది నామినేషన్ అయిందా లేక వాళ్ల ఫీలింగ్‌లో వాదించుకున్నారా.. నాకు అయితే నామినేషన్‌లా అనిపించలేదు అని చెప్పగా…విష్ణు ప్రియకు సగం అర్దమై అర్ధం కాక తనకు తోచింది చెప్పేసింది. మొత్తంగా అటూ యష్మీతో ఇటు ఇంట్లోని మిగితా వారితో తాను మంచి వాడిని అనిపించుకునేందుకు నిఖిల్ తాపత్రయం అంతా ఇంత కాదు.
Also Read:సరికొత్త అనుభూతిని పంచే..”ఆదిపర్వం”