బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 60 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా వంట చేస్తుండగా సడెన్‌గా కిచెన్ టైమర్ ఆపేస్తాడు బిగ్‌బాస్. దీంతో కంటెస్టెంట్లు తలలు పట్టుకున్నారు. ఇంతలో కిచెన్ టైమర్ పొందడానికి ఓ అవకాశం.. ఇస్తున్నా అని బిగ్ బాస్ చెప్పగా అవినాష్ ,రోహిణి చిన్నపిల్లలుగా మారతారు. వారు అడిగినవి కాదనకుండా ఇస్తే మీ కిచెన్ టైమర్ పెరుగుతుంది అని చెప్పాడు. అవినాష్ దొరికిందే ఛాన్స్ అన్నట్లు లేడీ కంటెస్టెంట్ల చుట్టూ ముద్దు కావాలి, ఎత్తుకోవాలి అంటూ తిరగగా ప్రేరణ, నయని…అవినాష్‌ను ఎత్తుకున్నారు.వీడేంట్రా ఇలా తగులుకున్నాడు.. ఏమడుగుతాడు అంటూ యష్మీ కాస్త టెన్షన్ పడింది. తర్వాత రోహిణి కూడా చిన్న పిల్ల గెటప్‌లో బాగానే ఎంటర్‌టైన్ చేసింది.
తర్వాత ‘తాడో పేడో’ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా వివిధ స్థలాల్లో ఉన్న చిన్న చిన్న తాడు ముక్కలను సేకరించి దానితో పెద్ద తాడును తయారు చేసుకొని దాని సహాయంతో ఒక వైపు ఉన్న లక్కీ బాక్స్‌ను మీవైపు లాక్కోవాలి.. ఎవరు లాక్కుంటారో వాళ్లు విజేతలు అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్కులో తేజ, రోహిణి, నిఖిల్, గౌతమ్ పోటీ పడగా నిఖిల్ విజేతగా నిలిచాడు.
తమకి వచ్చిన రెండు ఎల్లో కార్డ్స్‌ను ఒకటి రెడ్ కి.. ఇంకొకటి గ్రీన్ టీమ్‌కి ఇచ్చేసింది బ్లూ టీమ్. దీంతో రెండు టీమ్స్ వాళ్ల దాంట్లో నుంచి చెరొకరిని రేసు నుంచి తప్పించాల్సి ఉండగా దీంతో ఓ టీమ్ నుండి గౌతమ్, మరో టీమ్ నుండి విష్ణుప్రియ తప్పుకుంది. రేసు నుంచి తీసేయడంతో చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ కోల్పోయాడు గౌతమ్.
Also Read:క్యాన్సర్ ముప్పు తగ్గించుకోండిలా!
ఆ తర్వాత మెగా చీఫ్ కంటెండర్లుగా ఎంపికైన వారు హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజ అని బిగ్ బాస్ చెప్పగా ఎల్లో టీమ్ ఒక్క టాస్కులో కూడా గెలవకపోవడంతో వాళ్ల నుంచి ఎవరూ చీఫ్ రేసులోకే రాలేదు. తర్వాత వివిధ టాస్క్‌లను పెట్టగా చివరకు అవినాష్ కొత్త మెగా చీఫ్ అయ్యాడు.