బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 58 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అరాచకంగా మారింది. అమ్మాయిలు ఏడుస్తున్న వినలేదు అబ్బాయిలు. కాళ్లు పట్టుకున్న కనికరించలేదు. బీబీ ఇంటికి దారేది అనే టాస్క్‌లో ఈ రచ్చంతా జిగింది. ఈ టాస్కు కోసం సభ్యులంతా నాలుగు టీమ్‌లుగా విడిపోగా గెలవడానికి ప్రతి టీమ్ డైస్‌ను రోల్ చేస్తూ బీబీ ఇంటి వైపు కదలడానికి ప్రయత్నించాలి.. కానీ మీ ప్రత్యర్థులతో తలపడి ఛాలెంజ్‌లో గెలిచినప్పడుడే డైస్ రోల్ చేసే ఛాన్స్ వస్తుంది.. అందరకన్నా ముందుగా ఏ సభ్యులైతే బీబీ ఇంట్లోకి లేదంటే ఇంటి దగ్గరిగా చేరుతారో వారు మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారు అని చెప్పారు.
నాలుగు టీమ్‌లు ముగ్గురేసిగా విడిపోవాల్సి ఉంటుందని, టీమ్ రెడ్ గౌతమ్, ప్రేరణ, యష్మీ.. టీమ్ బ్లూ.. అవినాష్, నిఖిల్, హరితేజ.. టీమ్ గ్రీన్.. తేజ ,విష్ణుప్రియ, నబీల్.. టీమ్ ఎల్లో.. రోహిణి ,పృథ్వీ, నయని ఉంటారని చెప్పారు. మీరందరూ కలిసి నిర్ణయించుకొని గంగవ్వను ఏదో ఒక టీమ్‌లోకి తీసుకోండి.. ప్రతి టీమ్‌లో ఒక లీడర్.. ఇద్దరు ఫాలోవర్స్ ఉంటారు.. తెలివిగా లీడర్‌ను ఎంచుకోండి అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు.దీంతో అంతా ఆలోచించుకుని నాలుగు టీమ్‌లకి నలుగురు లీడర్లుగా యష్మీ, నబీల్, పృథ్వీ, హరితేజ ఎన్నుకోగా గంగవ్వను బ్లూ టీమ్‌లోకి తీసుకున్నారు.
టాస్క్‌లో భాగంగా మొదటి ఛాలెంజ్.. మంచు మనిషి. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి చేయాల్సింది అల్లా మీ ముందున్న భాగాలను ఉపయోగించి మీ టీమ్‌కి సంబంధించిన స్నో మ్యాన్‌ను ముందుగా పూర్తి చేయాలి.. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇందులో పాల్గొనే ముగ్గురు సభ్యులు కలిసి ఒకే జత స్కీస్‌ను ధరించి మందుకు కదలాల్సి ఉంటుంది..ఏ టీమ్ అయితే ముందుగా వారి టీమ్‌కి సంబంధించిన స్నో మ్యాన్‌ను పూర్తి చేస్తారో వారే ఈ ఛాలెంజ్ విజేతలుగా నిలుస్తారు అని ఈ ఛాలెంజ్‌కి గంగవ్వను సంచాలక్ చేశాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో టీమ్ బ్లూ విన్ అయింది.
ఆ తర్వాత నెక్ట్స్ ఛాలెంజ్ పానిపట్టు యుద్ధం.. ఇందులో గెలవడానికి మీరు చేయవలిసిందల్లా నాలుగు టీమ్స్ వాళ్ల ట్యాంక్‌లో ఉన్న వాటర్ తగ్గకుండా చూసుకోవడం.. బిగ్‌బాస్ అడిగినప్పుడు ఎవరి టీమ్‌కి సంబంధించిన ట్యాంక్‌లో అయితే నీరు తక్కువగా ఉంటుందో వారు ఛాలెంజ్ నుంచి తప్పుకోవాలి.. సమయానుసారం బజర్ మోగుతుంది.. ఆ సమయంలో మిగిలిన సభ్యుల నుంచి ఎవరైనా ఇద్దరు సభ్యులు ట్యాంక్‌లో నీటిని తగ్గించడానికి ప్రయత్నించొచ్చు.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
ఈ టాస్క్‌లో తన ఛాన్స్ రాగానే నిఖిల్ లోపలికి వెళ్లి రెడ్ టీమ్‌పై విధ్వంసమే చేశాడు. వాటర్ దగ్గర కాపాలాగా ఉన్న ప్రేరణ-యష్మీ ఇద్దరినీ ఇష్టమొచ్చినట్లు లాగి పారేశాడు. సంచాలక్ హరితేజ వద్దన్నా వినకుండా ఉన్మాదిలా ప్రవర్తించాడు. సంచాలక్‌కి గౌరవం ఇవ్లలేదని అడుగుతారు మీరే పాటించరు అంటూ నిఖిల్‌పై యష్మీ ఫైర్ అయింది. తర్వాత గౌతమ్ కూడా నిఖిల్‌పై ఫైర్ అయ్యాడు. చేయి పట్టుకొని ఆపడం వేరు.. లాగి పీకి ఆడటం వేరు అని అందరూ ఆగ్రహం వ్యక్తం చేయగా నిఖిల్ కూడా అదే స్థాయిలో స్పందించాడు.
Also Read:KTR:ఆగిన విద్యుత్ ఛార్జీల పెంపు..బీఆర్ఎస్ విజయం