Bigg Boss 8 Telugu: నబీల్ కన్నీటి పర్యంతం

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 57 రోజులు పూర్తి చేసుకుంది. తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో అవినాష్‌ని టెస్ట్ చేయడానికి డాక్టర్ వచ్చారు. టెస్ట్ చేశాకా కడుపు నొప్పి వస్తుంది కదా కనుక మిమ్మల్ని ఒక చిన్న స్కాన్ గురించి బయటికి తీసుకెళ్తాం అంటూ డాక్టర్ చెప్పాడు. తర్వాత నామినేషన్ ప్రక్రియ షురూ చేశాడు బిగ్‌బాస్.

మెగా చీఫ్ విష్ణుప్రియ.. ఇంట్లోవారి ప్రయాణాన్ని మరింత ముందుకు కొనసాగించడానికి అర్హత లేని ఐదుగురు సభ్యులని నామినేట్ చేసి ఒక్కొక్కరినీ జైల్లో పెట్టి తాళం వేయండి అని చెప్పాడు బిగ్‌బాస్. నామినేట్ అయిన సభ్యులు వారి వాదనలు కూడా వినిపించొచ్చు అని చెప్పాడు. తొలుత గౌతమ్‌ని నామినేట్ చేసింది విష్ణుప్రియ.
అశ్వత్థామ 2.0 అన్నందుకు గౌతమ్ హర్ట్ అవ్వడం కరెక్ట్‌గా అనిపించలేదు అని చెప్పాడు. డిఫెండ్ చేస్తూ గౌతమ్ యష్మీని మధ్యలోకి లాగాడు. నేను ప్రేరణతో మాట్లాడుతుంటే తను (యష్మీ) ఇంకా ఆజ్యం పోసింది.. అంటూ గౌతమ్ అన్నాడు. దీంతో గొడవ కాస్త గౌతమ్ వర్సెస్ యష్మీగా మారిపోయింది. తర్వాత ప్రేరణను నామినేట్ చేసింది విష్ణు. నువ్వు నన్ను ఫేక్ ఫ్రెండ్ అన్నావ్ అది నాకు నచ్చలేదు అని పాయింట్ చెప్పింది. బజ్జీల కోసం నామినేషన్ ఏంటో అంటూ తిట్టుకుంటూ జైల్లోకి వెళ్లింది ప్రేరణ.

తర్వాత తేజను నామినేట్ చేస్తూ ఈ వీక్ అంతా అద్భుతంగా ఆడావ్..అంటూ విష్ణు చెప్పింది. దీంతో అదేంటి ఆడినందుకు కూడా నామినేట్ చేస్తారా అంటూ ఆశ్చర్యపోయి జైల్లోకి వెళ్లిపోయాడు. తర్వాత విష్ణుప్రియకు సలహా ఇచ్చాడు పృథ్వీ. 60 రోజులుగా హౌస్‌లో ఉన్న వాళ్లు అర్హులో లేక 3 వీక్స్ నుంచి ఉన్న వాళ్లు అర్హులో ఈ హౌస్‌లో ఉండటానికి ఆలోచించు అని చెప్పగా నయని పావనిని నామినేట్ చేసింది. నాకు ఛార్జింగ్ టాస్కులో మీరు బాత్రూం వెనుక ఉండి ఆడటం నాకు నచ్చలేదు అని చెప్పింది.

Also Read:‘దేవకీ నందన వాసుదేవ’..రిలీజ్ డేట్

చివరగా నబీల్‌ను నామినేట్‌ చేసింది. టాస్కుల్లో సూపర్.. క్లాన్ డెసిషన్స్‌లో బంపర్… చాలా బాగుంటే నామినేట్ ఎందుకు మేడమ్ అంటూ నబీల్ అడిగాడు. నాకు ఒక బ్రదర్‌గా అని విష్ణు ఏదో చెప్పబోతే… బ్రదర్ వద్దు.. నాకు ఎవరూ సిస్టర్స్ లేరు ఈ హౌస్‌లో అంటూ నబీల్ అన్నాడు. నువ్వు పృథ్వీతో ఉంటే నేనెందుకు కనిపిస్తా.. నువ్వు 90 శాతం పృథ్వీతోనే ఉంటావ్.. పొద్దుట నుంచి రాత్రి వరకూ ఆడే ఉంటావ్ అని కౌంటర్ వేశాడు. మొత్తం తప్పు పాయింట్లు చెప్పి అబద్ధాలు చెప్పి నామినేట్ చేశావ్.. వచ్చే ఆదివారం చూసుకుందాం అంటూ నబీల్ అన్నాడు. ఇలా గౌతమ్, ప్రేరణ, తేజ, నయని, నబీల్‌లను విష్ణుప్రియ నామినేట్ చేసింది. నామినేషన్ తర్వాత నేను ఆడినా అబద్ధాలు చెబుతుంది అంటూ నబీల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

- Advertisement -