Bigg Boss 8 Telugu: గౌతమ్‌తో యష్మీ కటీఫ్

1
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 54 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో గౌతమ్‌తో పూర్తిగా కటీఫ్ చేసింది యష్మీ. తొలుత ఓ పొడుపు కథల టాస్కు పెట్టాడు. ఇందులో కొన్ని క్రేజీ కొశ్చన్స్ అడిగాడు. ఈ గేమ్‌లో ప్రేరణకి గౌతమ్‌కి మధ్యలో చిన్న డిస్కషన్ వచ్చింది. బజర్ ముందుగా గౌతమ్ నొక్కినా ఆన్సర్ మాత్రం ప్రేరణ చెప్పింది. తర్వాత నయనితో గౌతమ్ గురించి యష్మీ మాట్లాడింది. తప్పంటే తప్పు దాని మీదే నిల్చోవాలి.. ఇప్పుడు నన్ను వచ్చి తప్పు చేస్తున్నావని చెప్పి.. వేరే వాళ్లతో నువ్వు అదే తప్పు చేస్తే నేను ఒప్పుకోను అన్నాడు.

తర్వాత గౌతమ్ – యష్మీ మధ్య వాడివేడిగా డిస్కషన్ నడిచింది. నిన్ను ఇక్కడ సారీ అడగలేదనా అని యష్మీ చెప్పగా ఏం అవసరం లేదులే మేడమ్ అంటూ గౌతమ్ అన్నాడు. ఆ తర్వాత యష్మీ సారీ చెప్పినా గౌతమ్ కన్విన్స్ కాలేదు. దీంతో యష్మీ వదల్లేదు… నువ్వు తప్పు చేశావ్ అంటూ మళ్లీ వాదించింది. ఏం తప్పు చేశా.. గేమ్ ఏదైనా డెసిషన్ ఏదైనా.. నువ్వు నాతో మాట్లాడిన పద్ధతి నాకు నచ్చక నీతో గొడవ పడ్డా తప్ప గేమ్ గురించి కాదు అంటూ గౌతమ్ అన్నాడు.

టేస్టీ తేజ-హరితేజ దగ్గర యష్మీ టాపిక్ తెచ్చాడు గౌతమ్. నాకు పోయింది కంప్లీట్ రెస్పెక్ట్ పోయింది తన మీద.. ప్రేరణ నేను కూడా అంతకంటే ఎక్కువే అరుచుకున్నాం.. కానీ టూ మినిట్స్‌లో సాట్ ఔట్ అయిపోయింది అని చెప్పాడు. ఆ తర్వాత రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర నిఖిల్‌తో ముచ్చట పెట్టింది యష్మీ. చాలా కష్టం అయితే వద్దు.. చెప్పేదొకటీ చేసేదొకటి అంటూ నిఖిల్‌తో యష్మీ చెప్పగా నేను హర్ట్ అవ్వలేదు.. నువ్వే ఇవన్నీ చేస్తే నేను హర్ట్ అవుతా అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావ్ అంటూ యష్మీ తెలిపింది.

Also Read:జయసింహ నేతృత్వంలో ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్‌

ఆ తర్వాత తన బాధ ప్రేరణతో చెప్పుకుంది యష్మీ. సెపరేట్‌గా నా దగ్గరికొస్తాడు మాట్లాడతాడు.. ఇండైరెక్ట్‌గా ఒకటి చెబుతాడు.. అయ్యో పాపమని వదిలేస్తున్నా.. అందుకే నాకు కోపం వస్తుంది చాలా అంటూ యష్మీ తెలిపింది. ఇండైరెక్ట్‌గా నువ్వు అలా ఉంటే కెమెరాలు ఉన్నాయని.. నువ్వు మంచోడవ్వు ఫర్లేదు.. కానీ నాకు ఫేక్ చేయడానికి అవ్వదు అని తెలిపింది.

- Advertisement -