బిగ్‌బాస్ 8 తెలుగు విజయవంతంగా 51 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నామినేషన్స్ ప్రక్రియలో చెలరేగిన చిచ్చుతో విష్ణుప్రియ – పృథ్వీ బ్రేకప్ అయ్యారు. ఇక వీరిద్దరిని విడగొట్టడంలో సక్సెస్ అయింది యష్మీ. యష్మీ, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ కలిసి ముచ్చట పెట్టారు. నిఖిల్‌కి ప్రేరణ మసాజ్ చేస్తుండగా పృథ్వీతో యష్మీ చేసేయాల్సిందంతా చేసేసింది.
పృథ్వీ ఒక ఫ్రెండ్‌గా చెబుతున్నా విను.. నాకే మిమ్మల్ని చూసి చూసి విసుగొచ్చింది.. ఏంటి వాడికి తను (విష్ణు) స్పేస్ ఇవ్వట్లేదు.. ఇద్దరూ స్పేస్‌యే తీసుకోవట్లేదు.. ప్రతిసారి ఎక్కడ చూసినా ఇద్దరు ఇద్దరే కనిపిస్తారు…డైరెక్ట్‌గా కొశ్చన్ అడుగుతా చెప్పు కు ఏదైనా ఫీలింగ్ ఉందా తనపై అని యష్మీ అడిగితే లేదు అంటూ పృథ్వీ బదులిచ్చాడు.
అయితే తను జస్ట్ ఫ్రెండ్.. అంతేనా అని యష్మీ అంటే మళ్లీ అవును అన్నాడు. ఆ తర్వాత విష్ణుప్రియతో ఏకాంతంగా మాట్లాడాడు పృథ్వీ. నీకు ఏమైనా మనం ఓవర్ అయినట్లు అనిపిస్తుందా హౌస్‌లో అంటూ పృథ్వీ అడిగితే నో అంటూ విష్ణు అంది. నేను నీకు క్లారిటీ ఇచ్చా కదా నాకు ఎలాంటి రిలేషన్ షిప్ వద్దు అని నాకు సింగిల్‌గా ఉండటమే ఇష్టం ఇక ఆపేద్దాం అని పృథ్వీ అన్నాడు. దీంతో డన్ అంటూ విష్ణు అంది. పృథ్వీ ఒంటరిగా సిగరెట్ తాగుతూ ఆలోచిస్తుంటే విష్ణుప్రియ బెడ్ దగ్గరికి బాధగా వచ్చింది. ఇది చూసి అంతా ఓకేనా ఏమైంది అంటూ నబీల్ అడిగాడు. దీంతో విష్ణు కాస్త ఎమోషనల్‌గా ఫేస్ పెట్టింది.
Also Read:అన్ స్టాపబుల్ 4: బాలయ్యతో బాబు సందడి.. ప్రోమో వైరల్