Bigg Boss 8 Telugu: పృథ్వీ వర్సెస్ రోహిణి

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎనమిదో వారం నామినేషన్ ప్రక్రియతో మొదలుపెట్టాడు బిగ్ బాస్. ప్రతి ఇంటి సభ్యుడు ఈ ఇంట్లో ఉండటానికి అర్హత లేని ఇద్దరు సభ్యుల దిష్టి బొమ్మల మీద కుండలు పెట్టి కారణాలు చెప్పి వాటిని పగలగొట్టాల్సి ఉంటుందని.. మెగా చీఫ్ కారణంగా గౌతమ్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఈ ఇంట్లో ఒక నామినేషన్ షీల్డ్ ఉంది.. ఆ నామినేషన్ షీల్డ్‌ని మీకు నచ్చినవారికి ఇవ్వండి.. అది ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ సభ్యుడిని ఈ వారం నామినేట్ చేసిన ప్రతిసారి రూ.50 వేల రూపాయలు విన్నర్స్ ప్రైజ్ మనీ నుంచి డిడక్ట్ అవుతాయి అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్.

నామినేషన్ షీల్డ్ హరితేజకి ఇస్తున్నా అంటూ గౌతమ్ చెప్పాడు. నామినేషన్ ప్రక్రియ విష్ణుప్రియతో మొదలు కాగా ప్రేరణ, నిఖిల్‌లను నామినేట్ చేసింది. ఇక ప్రేరణ నామినేషన్ చేసిన సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్దం నెలకొంది. నువ్వు నీకు ఇచ్చిన కిల్లర్ గర్ల్ పవర్‌ను దుర్వినియోగం చేసుకున్నావ్.. సరైన వ్యక్తిని నువ్వు నామినేట్ చేయలేదు అని రీజన్ చెప్పింది విష్ణు. పెద్ద పెద్ద పదాలు వాడకు విష్ణు.. ఇక్కడ ఎవరికీ అమ్మానాన్న తమ్ముడు అలా ఫ్యామిలీలా ఏం లేదు.. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎందుకు తినాలి అని కౌంటర్ ఇచ్చింది ప్రేరణ.

తర్వాత రోహిణి …నిఖిల్‌, పృథ్విలను నామినేట్ చేసింది. ఛార్జింగ్ టాస్కులో గౌతమ్‌పై ఫిజికల్ అయింది నాకు నచ్చలేదు అని నిఖిల్‌తో చెప్పగా టాస్కుల విషయానికొస్తే చాలా అగ్రెసివ్ అవుతున్నావ్.. సెల్ఫిష్‌గా ఆడతావ్ అని పృథ్వి నామినేషన్ సందర్బంగా రీజన్ చెప్పింది రోహిణి. ఆ తర్వాత పృథ్వీ తొలుత ప్రేరణను నామినేట్ చేశాడు. కిల్లర్ గర్ల్స్‌గా ఉన్నప్పుడు నువ్వు పర్సనల్‌గా తీసుకొని నన్ను నామినేట్ చేశావ్.. అలానే నీకు షార్ట్ టెంపర్ ఉందని ఒప్పుకున్నావ్.. అందుకే నామినేట్ చేస్తున్నా.. అంటూ పృథ్వీ చెప్పాడు. తర్వాతి నామినేషన్ రోహిణికి వేశాడు.

Also Read:రాజాసాబ్..కొత్త లుక్‌లో ప్రభాస్!

ఈ క్రమంలో పృథ్విని రెచ్చగొట్టింది రోహిణి. నువ్వు అడ్డదిడ్డంగా వాదిస్తానంటే వాదించు.. నీ దగ్గర అసలు మేటర్‌యే ఉండదు.. మాట్లాడే మేటర్‌యే ఉండదు.. మంచిగా రెడీ అవుతావ్.. అద్దం ముందుకెళ్లి ఇలా ఇలా చూసుకుంటావ్.. కాఫీ తాగేసి కప్పు ఆమెకిచ్చేస్తావ్ (విష్ణుప్రియ అంటూ రోహిణి రెచ్చగొట్టింది. నేను ఆడుతున్నాను కాబట్టే 8వ వారానికి వచ్చానంటూ డిఫెన్స్ చేసుకుంటూ రోహిణిని పై నుంచి కిందకి చూశాడు పృథ్వీ. దీంతో ఏంటి ఆ లుక్కేంటి.. ఆ చూపేంటి.. ఆ చూడటమేంటి బాడీ షేమింగా.. నువ్వు చూసిన విధానం.. నాకు తెలుసు.. తొక్కలో నామినేషన్స్ చేయకు అని మండిపడింది.

- Advertisement -