Bigg Boss 8 Telugu: నిఖిల్ వర్సెస్ గౌతమ్..బయటికి వెళ్లిపోతా!

1
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 46 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నిఖిల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా సోఫాని పైకి ఎత్తిపారేసి రెచ్చిపోయాడు. టాస్క్‌లో భాగంగా ఎంతకీ వాళ్లు ఛార్జ్ ఇవ్వకపోవడంతో ఎవరో ఒకరిని లోపలికి లాగేసి కిడ్నాప్ చేసేద్దామని ప్లాన్ చేశారు రాయల్స్. తేలిగ్గా ఉంటాడని మణికంఠను పట్టుకొని లాగేశారు. ఇంతలో నిఖిల్ సహా ఓజీ క్లాన్ అంతా అడ్డుపడింది. అందరూ మణికంఠపై కాన్సట్రేషన్ చేయడంతో వెంటనే తెలివిగా యష్మీని లోపలికి లాగేశాడు అవినాష్. వెంటనే టేస్టీ తేజ డోర్ క్లోజ్ చేసేశాడు.

ఆ తర్వాత యష్మీని బయటికి తీసుకొచ్చేందుకు ఓజీ క్లాన్ అంతా తెగ ట్రై చేసింది. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత యష్మీని లోపలికి లాగేసి కేబుల్ కలిపి ఛార్జ్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తెలివిగా డ్రెస్‌కి ఉన్న కేబుల్ తెంపేసి.. ఊడిపోయింది అంటూ యష్మీ చెప్పగా ఆమెని వదిలేశారు. ఓజీ క్లాన్ ఓవర్ స్మార్ట్ ఫోన్స్ మీరు సైరన్‌కి సైరన్‌కి మధ్యలో ఛార్జింగ్ పాట్‌ను పగలగొట్టారు.. కాబట్టి ఒక సభ్యుడిని కంటెండర్‌షిప్ నుంచి అలానే టాస్కు నుంచి తప్పించాలి.. ఎవరో డిసైడ్ అయి చెప్పండి.. అంటూ బిగ్‌బాస్ అన్నాడు. దీంతో రాయల్ క్లాన్ ఎగిరి గంతేసింది.

ఆ తర్వాత మణికంఠ, విష్ణుప్రియ ఇద్దరు వాష్‌ రూమ్‌కి వెళ్లగా వారి లాక్ చేయడానికి ట్రై చేశారు రాయల్స్. ఇది చూసి ఓజీ క్లాన్ సభ్యులు కూడా లగెత్తుకుంటూ వచ్చేశారు. లోపలికి వచ్చి చూస్తే మణికంఠ వాష్ రూమ్‌లో ఉన్నాడు. దీంతో బయటికి రాకుండా బాత్రూం బయటే కాపలా నిల్చున్నారు రాయల్ సభ్యులు.
ఈ క్రమంలో నిఖిల్‌…గౌతమ్ మధ్య తోపులాట జరిగింది. దీంతో గౌతమ్‌ను పక్కకి లాగేశాడు నబీల్. మరోవైపు ఈ గొడవలోకి మెహబూబ్ రాకుండా పృథ్వీ ఆపేశాడు. దీంతో తాము పృథ్వీని టాస్కు నుంచి తీసేసినట్లు బిగ్‌బాస్‌తో చెప్పాడు అవినాష్.

Also Read:2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు!

ఆ తర్వాత కోపంలో గౌతమ్ మెడ పట్టుకొని పక్కనే ఉన్న సోఫాపైకి విసిరేశాడు నిఖిల్. కొడితే నేనూ కొడతా అంటూ నిఖిల్ అరవడంతో నేను కొట్టలే.. వాంటెడ్‌గా కొట్టలే అంటూ గౌతమ్ రెయిజ్ అయిపోయాడు. గార్డెన్ ఏరియాకి రాగానే గౌతమ్ బాబు శివాలెత్తిపోయాడు. ఎక్కువ తక్కువ మాట్లాడకు.. నేను కొట్టినట్లు ఫుటేజిలో ఉంటే మా అమ్మ మీద ఒట్టు.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికెళ్లిపోతా అని అరిచాడు గౌతమ్. ఇచ్చిన మాట ప్రకారం మెహబూబ్‌కి ఒక పాయింట్ ఛార్జింగ్ ఇచ్చాడు నిఖిల్.

పృథ్వీని టాస్కు నుంచి తీసేయడంతో సిగరెట్ తాగడానికి లైటర్ కావాలంటూ హరితేజను అడిగాడు. ఇక నిఖిల్ తనికి కూడా లైటర్ కావాలని అడగడంతో ఛార్జింగ్ ఇస్తారా అంటూ డీలింగ్ చేసింది హరితేజ.

- Advertisement -