బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 45 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు కొత్త టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇప్పుడు మీకు ఒక కథ చెప్పబోతున్నాను.. అది ఇప్పటి కథ కాదు భవిష్యత్ తరానిది.. అందరూ జాగ్రత్తగా వినండి.. మీరు ఇంట్లోకి వచ్చే సమయానకి ఈ ప్రపంచం స్మార్ట్‌గా ఉండేది.. మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్.. ఇలా అన్నీ మీకు నచ్చినవి.. మీ ఫేవరెట్‌గా ఎంచుకునే ఆప్షన్ మీకుండేది.. కానీ ఇప్పుడు టైమ్ మారిపోయింది.. ఇది 2050వ సంవత్సరం.. ప్రపంచమంతా ఓవర్ స్మార్ట్‌గా మారిపోయింది..అప్పుడు స్మార్ట్‌గా ఉన్న డివైజెస్ఇప్పుడు ఓవర్ స్మార్ట్ అయిపోయి.. ఈ ప్రపంచాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నాయి..ఇంతకుముందు ఆస్తుల కోసం భూముల కోసం గొడవలు జరిగేవి.. కానీ 2050 సంవత్సరంలో ఇక్కడ మనుషుల అవసరం లేదు.. ఛార్జ్ చేసుకోవడం.. ఒకరితో మరొకరు ఛార్జింగ్ కోసం గొడవ పడటమే ఈ ఓవర్ స్మార్ట్ లోకం నైజం అంటూ బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు.
ఓవర్ స్మార్ట్ ఫోన్‌లు బతకాలంటే ఛార్జింగ్ కావాలి.. కానీ స్మార్ట్ ఛార్జెస్ ఛార్జ్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు అందుకే అసలు గొడవ మొదలైంది. ఇంటిని అధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ ఫోన్స్‌గా రాయల్స్ క్లాన్.. గార్డెన్ ఏరియాను తమ అధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్‌గా ఓజీ క్లాన్ ఉంటారు. ఓవర్ స్మార్ట్ ఫోన్స్ ఛార్జింగ్ సమయం గడిచే కొద్దీ తగ్గుతూ వస్తుంది.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
అలానే ఓవర్ స్మార్ట్ ఫోన్స్ లక్ష్యం.. బ్యాటరీ ఎంప్టీ అయి చనిపోకుండా చూసుకోవడం.. ఓవర్ స్మార్ట్ ఫోన్‌కి ఛార్జింగ్ కావాల్సి వచ్చినప్పుడు.. ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్‌కి ఇంటికి కావాల్సినవి అనగా కిచెన్, బాత్రూం.. లివింగ్ ఏరియా, బ్యాడ్ రూంకి సంబంధించిన ఏ వసతి అయినా ఇచ్చి వారి సాకెట్‌లో మీ ప్లగ్‌ను పెట్టి ఛార్జ్ చేసుకోవాలి.. లేదంటే మీ సొంత తెలివితేటలు వాడి కూడా పొందొచ్చు.. ప్రతి ఐదు ఫోన్స్‌కి ఛార్జింగ్ ఇచ్చిన తర్వాత ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్‌కి ఒక బార్ ఛార్జింగ్ తగ్గుతుంది.. టాస్కు పూర్తయ్యే సమయానికి మీ రెండు క్లాన్స్ నుంచి బతికున్న సభ్యులే మెగా చీఫ్ కంటెండర్లు అవుతారు.. అంటూ బిగ్‌బాస్ కండీషన్ పెట్టాడు.
ఇక ఓవర్ స్మార్ట్ ఛార్జెర్స్‌కి సంబంధించిన మూడు ఛార్జింగ్ పాట్స్.. గార్డెన్ ఏరియాలో ఉన్నాయి.. సమయానుసారం ఒక సైరన్ వచ్చినప్పుడు ఓవర్ స్మార్ట్ ఫోన్స్ వెళ్లి అందులో ఒక్క పాట్‌ను మాత్రం పగలగొట్టడానికి ప్రయత్నించవచ్చు.. ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ వాటిని రక్షంచడానికి ప్రయత్నించాలి.. ఒక పాట్‌ను పగలగొట్టినప్పుడల్లా ఒక ఓవర్ స్మార్ట్ ఛార్జర్ సభ్యుడు చనిపోతాడు.. అలానే ఓవర్ స్మార్ట్ ఫోన్ అందరకీ ఒక బార్ పెరుగుతుంది.. సైరన్‌కి సైరన్‌కి మధ్యలో వచ్చే గ్యాప్‌లోనే పాట్‌ను పగలగొట్టాలన్న మాట.
అలానే రైడ్ పూర్తయిన తర్వాత మళ్లీ కుండను పగలగొట్టాలంటే మరో సైరన్ వచ్చేవరకూ వెయిట్ చేయాలి.. ఒకసారి వెళ్తే ఒక దాన్ని మాత్రమే పగలగొట్టాలి.. ఒకవేళ పగలగొట్టలేకపోతే ఓవర్ స్మార్ట్ ఛార్జర్లకి ఒక బార్ పెరుగుతుంది.. ఛార్జ్ చేసుకోవాలంటే కనీసం ఒక నిమిషం ప్లగ్ ఇన్ చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత కెమెరా దగ్గరికొచ్చి ఎవరి దగ్గర తీసకున్నారో చెప్పాలి.. ఓవర్ స్మార్ట్ ఫోన్‌లో ఉన్న ఛార్జ్ మొత్తం ఎంప్టీ అయిపోతే టాస్కు ఓడిపోయినట్లే.. టాస్కు ముగిసేసమయానికి ఎవరు అయితే బతికి ఉంటారో వారే మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారు.. అంటూ రూల్స్ చెప్పాడు బిగ్‌బాస్.ఇక టాస్కు మొదలుకాకముందే చేతులెత్తేశాడు మణికంఠ.
Also Read:తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్వీ సమావేశం