Bigg Boss 8 Telugu: అందరి టార్గెట్ యష్మీనే

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 37 రోజులు పూర్తి చేసుకుంది. ఆరోవారం నామినేషన్స్‌లో ఆరుగురు  యష్మీ,విష్ణుప్రియ ,సీత,పృథ్వీ,మెహబూబ్ ,గంగవ్వ నిలిచారు. తొలుత ఇవాళ్టి ఎపిసోడ్‌లో ముందుగా రోహిణి.. యష్మీని నామినేట్ చేసింది. తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేసింది రోహిణి. మొదటి వారం చూసినప్పుడు విష్ణు బాగా ఆడుతుందనే ఫీలింగ్ కలిగింది కానీ ఆ రేంజ్ నుంచి తర్వాత కిందకి పడిపోయావ్.. నీ కాన్సట్రేషన్ వేరే చోట ఉంది.. నువ్వు రియల్‌గా ఉండు అని రోహిణి సలహా ఇచ్చింది.

తర్వాత గంగవ్వ తన తొలి నామినేషన్‌ని విష్ణుప్రియకు వేసింది. నువ్వు గేమ్ ఆడట్లేదు.. నీకు కాళ్లు చేతులు సక్కగా లేవా ఉన్నా మరెందుకు ఆడట్లే అని చెప్పింది. దీంతో రేపటి నుంచి నా అల్లరి చూస్తావ్ అంటూ విష్ణు ప్రియ తెలిపింది. రెండో నామినేషన్‌ని యష్మీకి వేసింది గంగవ్వ. మీరు 8 మంది ఉన్నారు.. మేము 8 ఉన్నాం.. వచ్చినప్పటి నుంచి మీరు మాతో మాట్లాడనేలేదు.. మీ రూమ్‌కి వచ్చినా మీరు కేర్ చేయలేదు అని చెప్పగా సారీ.. రోజూ మీతోనే మాట్లాడతా.. నాకు వచ్చిన చాక్లెట్ కూడా షేర్ చేసుకుంటా అని తెలిపింది.

అవినాష్.. పృథ్వీని మొదటిగా నామినేట్ చేస్తూ ప్రభావతి టాస్కు.. బెలూన్ టాస్కు తప్ప మీరు ఎక్కడా కనిపించలేదు.. ఆ ప్రభావతి టాస్కులో కూడా అమ్మాయిలతో ఆడారు అంటూ చెప్పాడు. తర్వాత రెండో నామినేషన్‌ని యష్మీకి వేశాడు. దీంతో అత్యధికంగా యష్మీకి ఆరు నామినేషన్లు పడ్డాయి.

తర్వాత ఓజీ క్లాన్ ఇప్పుడు మీ వంతు.. మీరు రాయల్స్ క్లాన్ నుంచి ఇద్దరు సభ్యులను అందరూ కలిసి డిస్కస్ చేసుకొని నామినేట్ చేయాలి అని చెప్పారు బిగ్ బాస్. నిన్న వారు రెండు షీల్డ్స్ గెలుచుకున్నారు.. వారు నామినేషన్ షీల్డ్‌ను ఉపయోగించుకోవచ్చు.. ఆ షీల్డ్ ఉన్న వారిని మీరు నామినేట్ చేయాలంటే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి లక్ష రూపాయలు కోల్పోతారు అని మెలిక పెట్టాడు బిగ్ బాస్.

Also Read;‘మా నాన్న సూపర్ హీరో’..100% హిట్: సుధీర్ బాబు

- Advertisement -