బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 36 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఆరోవారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. వైల్డ్ కార్డ్స్ రాకతో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈసారి నామినేషన్స్ రాయల్ క్లాన్ మాత్రమే చేస్తారు.. మీకు ఎవరు అనర్హులని భావిస్తే వాళ్లలో ఇద్దరూ ఓజీ క్లాన్ సభ్యులను నామినేట్ చేయాలి.. మెగా చీఫ్ అయిన కారణంగా నబీల్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పాడు బిగ్ బాస్.
తొలుత నామినేషన్‌ను మొదలు పెట్టింది హరితేజ. ఫస్ట్ నామినేషన్ యష్మీకి వేసింది. మీరు హౌస్‌లో చెప్పేది ఒకటే చేసిది ఒకటి.. పర్సన్ పర్సన్‌కి మీ రూల్స్ మారుతున్నాయి అందువల్ల నామినేట్ చేసినట్లు తెలిపింది. ఫ్యామిలీ పంపిన ఫుడ్ విషయంలో మీరు అది మణికంఠకి ఇచ్చి ఉంటే బావుండేదని అనిపించింది..ఎందుకంటే.. మీకు ఇష్టమైన వాళ్లవి ఎమోషన్స్ మిగిలిన వాళ్లవి కాదు అనేటట్టుగా ఉంది మీ బిహేవియర్ అంటూ తెలిపింది. తన సెకండ్ నామినేషన్ పృథ్వీకి వేసింది హరితేజ. మీరు టాస్కులు ఆడేటప్పుడు స్ట్రెంత్‌తో అలానే కాస్త పొగరుగా కూడా ఆడతారు అని చెప్పింది.
Also Read:జమ్మూలో కాంగ్రెస్ కూటమి..హర్యానాలో బీజేపీ
తర్వాత గౌతమ్ తన మొదటి నామినేషన్.. విష్ణుప్రియకి వేశాడు. బిగ్‌బాస్ అనేది ఇండివీడ్యువల్ గేమ్.. కానీ నువ్వు నీ గేమ్ వదిలేసి.. వేరే రూట్‌లో వెళ్తున్నావని అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. తన సెకండ్ నామినేషన్ యష్మీకి వేశాడు గౌతమ్. రివెంజ్ నామినేషన్ వేస్తున్నారు.. మణికంఠను ప్రతిసారి నిన్నే నామినేట్ చేస్తానని చెప్పడం కరెక్ట్‌గా అనిపించలేదు చెప్పాడు.
రివెంజ్ నామినేషన్ పాయింట్ ఒప్పుకుంటా.. కానీ అలా ఎందుకు చేయకూడదు.. నాకు ఇబ్బందిగా అనిపించినప్పుడు నేను చేస్తా అంటూ యష్మీ చెప్పగా … యష్మీ నీకు ఒక సలహా ఇస్తున్నా.. నువ్వు మాట్లాడేటప్పుడు నీ యాక్షన్స్ కూడా కొంచెం చూసుకో అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి కళ్లు పక్కకి తిప్పి ఆహా చూసుకుంటా.. మాట్లాడదాం అన్నీ అంటూ యష్మీ అంది.