Bigg Boss 8 Telugu: మెగా చీఫ్‌గా నబీల్

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 32 రోజులు పూర్తి చేసుకుంది. మెగా చీఫ్ అయ్యేందుకు పృథ్వీ, నబీల్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు జరుగగా నబీల్ విజేతగా నిలిచి మెగా చీఫ్ అయ్యారు. తొలుత హౌస్‌లో చీఫ్ కంటెండర్ అయ్యేందుకు బిగ్‌బాస్ పెట్టిన పప్పీల టాస్కుఇవాళ కూడా కొనసాగింది. నబీల్, నిఖిల్, ప్రేరణ ఆటను కొనసాగించగా పప్పీని తీసుకొని చివరిగా లోపలకి ఆదిత్య వచ్చాడు. అయితే ఆదిత్య చేతిలో ఉన్న పప్పీపై ప్రేరణ పేరు ఉంది. దీంతో వీరిద్దరూ డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ఇద్దరిలో ప్రేరణను సెలక్ట్ చేసి ఆదిత్యను తప్పించింది నైనిక.

తర్వాత నబీల్, నిఖిల్, ప్రేరణ పప్పీ టాస్కు ఆడగా చివరిగా నిఖిల్ పేరున్న పప్పీతో ప్రేరణ వచ్చింది. దీంతో ఇద్దరిలో ఎవరు ఉండాలి లేదు అనేది ఆదిత్య డిసైడ్ చేయాల్సి వచ్చింది. ఈ రేసులో చివరిగా మిగిలిన ప్రేరణ-నబీల్‌లలో చీఫ్ కంటెండర్ అయ్యేందుకు ఇంటి సభ్యులందరూ కలిసి ఒకరిని నిర్ణయించండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.

ప్రేరణ , నబీల్ ఇద్దరూ హౌస్‌మెట్స్‌కి తమ వెర్షన్ చెప్పుకున్నారు. నా వల్ల నా క్లాన్ వాళ్లకి చాలా ఇరిటేషన్ వచ్చింది.. కానీ తప్పు చేస్తే నా వాళ్ల మీదైనా నేను గట్టిగా అరుస్తా అని చెప్పాడు. దీంతో సభ్యులంతా అప్పటికే చీఫ్ కంటెండర్ అయిన పృథ్వీకి ఒక్కొక్కరు చెప్పారు. బ్యాలెన్స్ సిట్యువేషన్ వచ్చినప్పుడు నబీల్ బెటర్.. అంటూ సీత చెప్పింది. దీంతో ప్రేరణ తప్పుకోగా తర్వాత చీఫ్ కంటెండెర్స్‌ అయిన నబీల్-పృథ్వీలకి బిగ్‌బాస్ టాస్కు ఇచ్చాడు.

Also Read:మంచి కంటెంట్‌తో వస్తున్న ‘కలి’:వరుణ్ తేజ్

రాజయ్యేది ఎవరు.. అంటూ సాగే ఈ టాస్కు గెలిచిన వారు మెగా చీఫ్ అవుతారు అని చెప్పాడు. ఇది గెలవాలంటే బ్లాక్స్‌ను సరైన సెంటైన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్‌లో పెట్టాలి.. వాటి కోసం అడ్డంకులు దాటుకుంటూ వెళ్లాలి అని తెలిపాడు బిగ్ బాస్. మొదటి బ్లాక్స్‌ను సంపాదించడానికి పాకుతూ వెళ్లాలి.. తర్వాత సాండ్ బాక్స్‌లో ఉన్న బ్లాక్స్ తీసుకోవాలి.. తర్వాత స్క్రూను తిప్పి దాని కింద ఉన్న కొన్ని బ్లాక్స్ తీసుకొని.. చివరిగా జిగ్ జాగ్ దాటుకుంటూ బ్లాక్ స్టాండ్ దగ్గరికెళ్లి సెంటైన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్లో పెట్టాలి.. ఎవరు ముందుగా పెడతారో వాళ్లే మెగా చీఫ్ అని చెప్పగా ఈ టాస్కుకి ప్రేరణ సంచాలక్ గా వ్యవహారిస్తారని బిగ్ బాస్ తెలిపాడు. అయితే బ్లాక్స్ అన్నీ ముందే కలెక్ట్ చేసి స్టాండ్ వరకూ వెళ్లాడు పృథ్వీ కానీ I am Mega Chief అనే సెంటెన్స్‌ను ఫామ్ చేయడంలో తప్పు చేశాడు. అయితే నబీల్ కాస్త లేటు అయినా కరెక్ట్‌గా పెట్టడంతో నబీల్ విన్నర్ అంటూ ప్రేరణ ప్రకటించింది.

- Advertisement -