Bigg Boss 8 Telugu: మణికంఠ మగాడు కాదన్న యష్మీ!

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 31 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా బిగ్ బాస్ ఓ టాస్క్ ఆడించారు. నాగ మణికంఠ సూపర్ మచ్చి అనే ఐటమ్ సాంగ్‌కి చిందులు వేశారు. మధ్యలో నైనిక జాయిన్ అయ్యి.. ఓ ఊపు ఊపేశారు. ఆ తర్వాత నబీల్‌కి స్పూన్‌తో బకెట్ నీళ్లు నింపాలని టాస్క్ ఇచ్చారు.

ఇక పృథ్వీకి లేడీ గెటప్ వేయగా విష్ణు అయితే ఆ గెటప్ చూసి తెగ సిగ్గుపడిపోయింది. అయితే ఈ టాస్క్‌లో కాంతారా టీం గెలవడంతో.. వాళ్లకి చాక్లెట్స్ పంపించాడు బిగ్ బాస్. కాంతారా టీం సభ్యులు ఎక్కువ టాస్క్‌లు గెలిచిన కారణం వాళ్లకి స్పెషల్ పవర్ లభిచింది. వాళ్ల క్లాన్ నుంచి నేరుగా చీఫ్ అవకాశాన్ని ఇచ్చారు.

ఈ క్రమంలో యశ్మీ, పృథ్వీ మధ్య గొడవ స్టార్ట్ అయింది. నువ్వు వాయస్ పెంచకు.. ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావ్.. పైగా నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావని నీకు నువ్వే ఒప్పుకున్నావ్.. మళ్లీ చీఫ్ అవుతానని ఎలా అంటున్నావ్.. నువ్వు నా మిస్టేక్స్ చెప్తే.. నేను నీ మిస్టేక్స్ చెప్తా అని యష్మీతో చెప్పాడు పృథ్వీ. హా చెప్పు.. నా మిస్టేక్స్ ఏంటో చెప్పు అని అన్నప్పుడు.. యష్మీ అసలు బాగోతాన్ని బయటపెట్టాడు పృథ్వి.

మణికంఠని మగాడు కాదని అన్నావ్ కదా.. అనలేదని అబద్దం చెప్పావ్ అని పృథ్వీ చెప్పగా తాను అలా అనలేదని ఒట్టేసి మరీ అబద్దం ఆడింది యష్మీ. నువ్వు ఒట్లు పెట్టకు.. నువ్వు ఆరోజు అన్నావ్.. ఇప్పుడు అనలేదని అంటున్నావ్. మణికంఠని బాయ్ కాదని అనడం నువ్వు చేసిన తప్పు. దాన్ని మళ్లీ ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు అని చెప్పాడు నీకు నువ్వే చీఫ్‌గా ఫెయిల్ అయ్యానని రెడ్ ఇచ్చుకున్నావ్.. నీకు నువ్వే తెలుసు.. బ్యాడ్ ప్లేయర్ అని.. స్పెల్లింగ్ గేమ్‌లో ఓడిపోయావ్.. ఇవన్నీ నీ మిస్టేక్సే అని యష్మీ బాగోతాలను వరుసగా బయటపెట్టాడు పృథ్వీ.మొత్తంగా తాజా ఎపిసోడ్‌ రచ్చరచ్చగా మారింది.

Also Read:Bigg Boss 8 Telugu: ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరో తెలుసా!

- Advertisement -