Bigg Boss 8 Telugu:ఐదోవారం నామినేషన్స్‌లో ఉంది వీరే

1
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా ఐదో వారంలోకి అడుగుపెట్టగా తాజా వారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు సభ్యులు ఉన్నారు.ముందుగా నబీల్..విష్ణుప్రియను నామినేట్ చేస్తూ గేమ్ ఆడాలానే ఫైర్ నీలో ఆరిపోతుంది.. గివ్ అప్ ఇచ్చేస్తున్నావంటూ చెప్పాడు. తన రెండో నామినేషన్ నైనికకి వేశాడు నబీల్. తర్వాత ఆదిత్య తన మొదటి నామినేషన్ నైనికకి, రెండో నామినేషన్ విష్ణుప్రియకు వేశాడు. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ మీరు అప్పుడప్పుడు మాటలు వదిలేస్తున్నారు.. అవి వేరే వాళ్లను హర్ట్ చేస్తున్నాయంటూ చెప్పాడు. నిఖిల్‌ తొలుత విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యద్ధం నెలకొంది. నువ్వు అప్పుడప్పుడు మాట్లాడేది ఫన్‌గా అనిపిస్తుంది.. కానీ కొన్నిసార్లు అది అవతలి వాళ్లకి హర్ట్ అవుతుంది అని చెప్పగా నా వల్ల హౌస్‌లో హర్ట్ అయ్యారు అని చెప్పింది ఇద్దరే ఒకరు నువ్వు, రెండోది సోనియా. నిన్ను అన్న మాటలు అంటావా.. నన్ను కూడా నువ్వు అనే చనువు నీకుంది అని చెప్పింది. తర్వాత తన రెండో నామినేషన్ మణికంఠకి వేశాడు నిఖిల్.

ప్రేరణ మొదటిగా మణికంఠను నామినేట్ చేసింది. అసలు నువ్వు శాక్రిఫైజ్ ఎందుకు చేశావ్.. ఏదైనా సరే నువ్వు త్యాగం చేసుకోకూడదు.. నువ్వు మిగిలిన వాళ్ల కంటే ఫిట్టెస్ట్ అయి ఉండొచ్చు అని తన రీజన్ చెప్పింది. రెండో నామినేషన్ ఆదిత్యకి వేసింది ప్రేరణ. గేమ్ మొత్తం బాగా ఆడుతున్నారు కానీ కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పగా ఒక పర్సన్‌కి ఎందుకు బ్యాడ్ క్వాలిటీస్ మనం చెప్పాలి.. వాళ్లలో మంచి ఉండదా.. ఇక్కడున్న వాళ్లంతా ఏమైనా విలన్‌లా అని ఆదిత్య రిప్లై ఇచ్చాడు. దీనికి ప్రేరణ కాస్త రెచ్చగొట్టి వెంటనే ఆదిత్య ఫొటో మంటల్లో వేసింది. దీంతో ఆ ఫొటోను మంటల్లో చేయి పెట్టి తీస్తూ “ఇది నా కాన్ఫిడెన్స్.. టాస్కు వస్తే నేను ఇలా కూడా చేస్తా..” అంటూ ఆదిత్య అన్నాడు. దీంతో బిగ్ బాస్ హెచ్చరించాడు.

Also Read:మహారాణి రుక్మిణీదేవిగా రీతూ వర్మ

తర్వాత విష్ణుప్రియ తనను నామినేట్ చేసిన నైనిక, నబీల్ ఇద్దరినీ నామినేట్ చేసింది. చివరిగా పృథ్వీ మొదట నైనికను నామినేట్ చేశాడు. విష్ణుప్రియతో మీ ఫ్రెండ్ షిప్ బ్రేక్ చేయడానికి నేను ట్రై చేశా అన్నారు.. అది నాకు నచ్చలేదంటూ పాయింట్ చెప్పాడు. తన సెకండ్ నామినేషన్ మణకంఠకి వేశాడు. నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యాక బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఇంట్లో ఉన్న సభ్యులకి ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాం.. చీఫ్‌లు ఇద్దరిలో మీరు ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయొచ్చు అంటూ బిగ్‌బాస్ అన్నాడు. దీంతో ఆరుగురు సభ్యులు సీతను సేవ్ చేయాలంటూ హ్యాండ్స్ రెయిజ్ చేశారు. దీంతో నిఖిల్ కూడా నామినేషన్స్‌లోకి వచ్చాడు. మొత్తంగా ఈ వారం విష్ణుప్రియ,నైనిక,మణికంఠ,ఆదిత్య,నబీల్,నిఖిల్ నామినేషన్స్‌లో నిలవగా వీరిలో ఎవరూ ఇంటి నుండి బయటకు వస్తారో వేచిచూడాలి.

- Advertisement -