Bigg Boss 8 Telugu: స్పెషల్ పవర్‌ దక్కించుకున్న మణికంఠ

8
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 26 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా సోనియాని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడు నిఖిల్. తొలుత రేషన్ టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. ఆహారాన్ని నిల్వ చేసుకునే అవకాశం మీకు ఇస్తున్నాం.. మేము ఇచ్చే సౌండ్స్‌ను వరుస క్రమంలో రాయాలి.. ఎవరైతే ఎక్కువ కరెక్ట్ రాస్తారో వారికి సూపర్ మార్కెట్‌లో ఎక్కువ సమయం షాపింగ్ చేసే అవకాశం దొరుకుతుంది అని చెప్పాడు. నబీల్ ఈ టాస్క్‌కి సంచాలకుడిగా ఉండగా ఈ టాస్కులో నిఖిల్ టీమ్ విజేతగా నిలిచింది. దీంతో నాన్ వెజ్ ఒక్క పీస్ కూడా లేకుండా సీత వచ్చే ముందే నిఖిల్ సద్దేయగా సీతకి ఆకుకూరలు తప్ప ఏం మిగల్లేదు.

తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ నిల్చోబెట్టి వాళ్ల ముందు ఓ గోల్డెన్ బ్యాండ్ పెట్టాడు బిగ్‌బాస్. ఆ బ్యాండ్‌కి ఓ స్పెషల్ పవర్ ఉంది.. దాన్ని ఉపయోగించుకొని సొంత క్లాన్ నుంచి వేరే క్లాన్ కి వెళ్లిపోవచ్చు అని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఎవరూ ముందుకురాలేదు. కాసేపటి తర్వాత ఆ గోల్డెన్ బ్యాండ్‌ను ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు అంటూ బిగ్‌బాస్ అడిగితే మణికంఠ ముందుకొచ్చాడు. అది తీసి చేతికి వేసుకున్నాడు.

మణికంఠ ఇప్పుడు మీకున్న పవర్‌తో మీరు వేరే క్లాన్‌కి వెళ్లొచ్చు.. అలానే మీరు వెళ్లాలనుకుంటున్న క్లాన్ నుంచి ఒక సభ్యుడ్ని ఎంపిక చేసి మీ క్లాన్‌లోకి పంపించండి అని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో మణి కాంతార టీమ్‌లోకి ఆదిత్య శక్తి టీమ్‌లోకి మారిపోయారు. తర్వాత బీబీ అడ్డా అంటూ ఓ ఎంటర్‌టైనింగ్ టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. మీ తోటి సభ్యులను ఇమిటేట్ చేసి నవ్వించాలని కోరుతున్నాం అని బిగ్ బాస్ చెప్పగా ప్రతి ఒక్కరూ తమకి నచ్చిన కంటెస్టెంట్ బొమ్మ ఉన్న ట్యాగ్ వేసుకొని ఇమిటేట్ చేశారు. ముందుగా మణికంఠను ప్రేరణ ఇమిటేట్ చేసింది. యాక్టింగ్ వరకూ అంతా బాగానే ఉన్నప్పటికీ మణికంఠ విగ్గు ఎపిసోడ్‌ను కాస్త కామెడీ చేసింది ప్రేరణ. ఈ ఆదిత్యను ఇమిటేట్ చేసిన నబీల్ సేమ్ టూ సేమ్ దించేశాడు. నబీల్‌కే బెస్ట్ పెర్ఫార్మర్ అంటూ అందరూ ఏకగ్రీవంగా ఇచ్చేశారు.

Also Read:విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని.. 

- Advertisement -