Bigg Boss 8 Telugu: ప్రేరణ కోసం యష్మీ త్యాగం

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా 24 రోజులు పూర్తి చేసుకుంది. ఇక తాజా ఎపిసోడ్‌లో రెండు క్లాన్‌ సభ్యులను మరోసారి టీమ్స్ సెలక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో విష్ణుప్రియ, నైనిక, నబీల్, ఆదిత్య, యష్మీ ఇలా అందరూ తమ రీజన్స్ చెప్పి సీత క్లాన్‌నే సెలక్ట్ చేసుకున్నారు. సోనియా, పృథ్వీ మాత్రమే నిఖిల్ టీమ్‌లోకి వెళ్లారు.

అయితే సీత టీమ్‌లో ఆరుగురు సభ్యులు అవడంతో బిగ్‌బాస్ జోక్యం చేసుకున్నాడు. సీత టీమ్ ఇప్పటికే ఫుల్ అయింది కాబట్టి మణికంఠ మీరు శక్తి క్లాన్‌లోకి వెళ్లాలి అని సూచించాడు. ఒక వేళ మీరు కాంతార క్లాన్‌లోకి వెళ్లాలంటే సీత తన టీమ్‌లో ఎవరో ఒకరిని శక్తి టీమ్‌తో స్వాప్ చేయాలి అని సూచించాడు బిగ్ బాస్. తన టీమ్‌లోకి అందరూ ఇష్టపూర్వకంగా రావడంతో వాళ్లని స్వాప్ చేసి హర్ట్ చేయలేనని చెప్పడంతో తప్పక మణికంఠ.. నిఖిల్ టీమ్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.

చివరగా ప్రేరణ మిగిలిపోవడంతో మణికంఠకి చెప్పిన స్టోరీనే చెప్పాడు బిగ్ బాస్. అయితే దీనికి ప్రేరణ ఒప్పుకోలేదు. దీంతో తన ఫ్రెండ్ ప్రేరణ కోసం యష్మీ త్యాగం చేసింది. దీంతో ప్రేరణ.. సీత టీమ్‌లోకి రాగా.. యష్మీ.. నిఖిల్ చీఫ్ అయిన శక్తి టీమ్‌లోకి వెళ్లింది. నిఖిల్ టీమ్‌లోకి సోనియా, పృథ్వీ, మణికంఠ, యష్మీ రాగా సీత టీమ్‌లో విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, నబీల్, ప్రేరణ ఉన్నారు. కాంతార టీమ్ పెద్దదైనా కారణంగా డ్రాగన్ ఫ్లై రూమ్‌ను వారికే ఇచ్చేశాడు బిగ్‌బాస్.

ఈ అవకాశంతో నీకు విష్ణుప్రియకి, నీకూ సీతకి ఇలా అందరితో ఉన్న క్లాషెస్ సాల్వ్ చేసుకో అంటూ ప్రేరణకి సలహా ఇచ్చింది యష్మీ. ప్రతిరోజూలానే నిఖిల్-సోనియా-పృథ్వీ సోఫాలో కూర్చొని ముచ్చట్లు స్టార్ట్ చేశారు.

Also Read:ఇలా చేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం.. పదిలం!

- Advertisement -