Bigg Boss 8 Telugu: చీకట్లో సోనియా..నిఖిల్, ఏంచేశారో తెలుసా?

4
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా నాలుగో వారంలోకి ఎంటరైంది. మంగళవారం నామినేషన్స్ ప్రక్రియ కొనసాగగా యష్మీ గురించి సోనియా మాట్లడిన మాటలు చెండాలంగా ఉన్నాయి. వాడు (పృథ్వీ) ఎలా పట్టుకున్నాడు.. ఎలా వదిలాడు అని అంత క్లియర్‌గా చెబుతుంటే.. ఎంత అబ్జర్వ్ చేశావో.. అదే నేను చెప్పా అని సోనియా చెప్పగా నేను గేమ్ పరంగా చెప్పాను.. నీలా ఆలోచించలేదు.. నువ్వు మాత్రం దానికి ఒక రిలేషన్ తగిలించి మాట్లాడటం సరికాదని యశ్మీ కౌంటర్ ఇచ్చింది. సిస్టర్ మదర్ అని చెప్పి చేయి చేయి పట్టుకొని మాట్లాడితే మేము తప్పుగా మాట్లాడకూడదా అంటే ఎవరు హౌస్‌లో తప్పుగా ఆలోచిస్తున్నారో నువ్వు గుర్తుపెట్టుకో అని కౌంటర్ ఇచ్చింది.

ఆ తర్వాత రూమ్‌లోకి వెళ్లిన తర్వాత కూడా వీళ్ల గొడవ కంటిన్యూ అయింది. అందరి పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావ్ గుర్తుపెట్టుకో యష్మీ ఫైర్ అయింది. పృథ్వీ నిన్ను ఒకసారి పట్టుకోగానే ఇలా పట్టుకున్నాడు అలా పట్టుకున్నాడని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నా గేమ్ నీకెందుకు కనబడలేదు అని సోనియా బదులిచ్చింది. ఆ తర్వాత యష్మీని ఓదార్చాడు నిఖిల్.

సోనియా అక్కడి నుంచి వెళ్లిపోయాక నిఖిల్‌ సహా అక్కడున్నవాళ్లతో తన బాధ చెప్పుకుంది యష్మీ. ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా తను ఎక్కడ నోరు జారి ఏం అనేస్తుందోనని భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక అర్థరాత్రి సోనియా-నిఖిల్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. సోనియా చేతిలో చేయి వేసి సారీరా అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి సోనియా బరస్ట్ అయింది. దీంతో సోనియాకు సారీ చెప్పాడు నిఖిల్.

యశ్మీ నన్ను ఫేక్ బతుకు బతుకుతున్నావ్ అన్నది.. వాళ్లని ముందు పెట్టి ఆడుతున్నావ్ అన్నది.. వాళ్లని యూజ్ చేసుకుంటున్నావ్ అన్నది.. టుడే యూ బ్రోక్ మై హార్ట్.. దట్స్ ఇట్.. ఇది పర్సనల్ అంటూ ఎమోషనల్ అయింది సోనియా. ఆ తర్వాత పృథ్వీ, నిఖిల్‌కు క్లాస్ పీకింది సోనియా. నాకు బిగ్‌బాస్ అంటే గేమ్ షో కాదు నాకు ఒక లైఫ్ లెసన్.. లైఫ్‌లో ఎన్ని ఫేస్ చేశామో అన్నీ కనబడతాయి.. 30 ఏళ్ల మన బతుకు ఇక్కడ కనబడతుంది అని తెలిపింది సోనియా. దీంతో సోనియా – నిఖిల్ మధ్య గ్యాప్ మరింత పెరిగింది.

Also Read:త్వరలో తమిళనాడుకు కేటీఆర్

- Advertisement -