Bigg Boss 8 Telugu: సోనియా వర్సెస్ నిఖిల్

4
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా 19 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో పద్మావతి టాస్క్ ముగియగా శక్తి(నిఖిల్) టీమ్ విజయం సాధించింది. తర్వాత రూమ్‌లోకి వెళ్లాక బిగ్‌బాస్‌ను బండ బూతులు తిడుతూనే ఉన్నాడు అభయ్. బిగ్‌బాస్ కాదు నువ్వు బయాస్‌డ్ (పక్షపాతం) బాస్.. నేను మాట్లాడింది కట్ చేస్తారేమో కానీ నేను బయటకెళ్లాక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తానని అన్నారు.

పద్మావతి టాస్కులో గెలవడంతో నిఖిల్‌కి డైరెక్ట్‌గా టీమ్‌కి చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. ఓడిపోయినందుకు కాంతార టీమ్ చీఫ్ పదవి నుంచి అభయ్‌ను తీసేశాడు బిగ్‌బాస్. తర్వాత రెడ్ ఎగ్ ఎవరిదగ్గర ఉందని అడగ్గా మా టీమ్ దగ్గరే అంటూ నిఖిల్ సమాధానమిచ్చాడు. దీంతో ఆ రెడ్ ఎగ్ ఎవరిదగ్గర ఉంటే వాళ్లు క్లాన్ చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందుతారు అని చెప్పారు.

రెడ్ ఎగ్ కోసం శక్తి టీమ్ సభ్యులు ఎవరికి నచ్చినట్లు వాళ్లు నిఖిల్‌తో బేరాలాడారు. విష్ణుప్రియ మాత్రం నాకు చీఫ్ అవ్వాలన ఆలోచన లేదు అని క్లారిటీ ఇచ్చేసింది.
తర్వాత అర్ధరాత్రి నిఖిల్, సోనియా, పృథ్వీ, అభయ్ ముచ్చట పెట్టకున్నారు. నిఖిల్.. సోనియాను దగ్గరికి తీసుకొని సారీ అని చెప్తున్నా కదా.. ఇక నుంచి నువ్వు సిగరెట్ తాగద్దంటే తాగ అని మాట ఇచ్చాడు. అయితే సోనియా ఇచ్చిన సమాధానంతో ఎక్కడో కాలింది నిఖిల్‌కి. దీంతో అంతే స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేశాడు. సోనియా గురించి అభయ్ దగ్గర క్లియర్‌గా చెప్పాడు నిఖిల్. సిగరెట్ విషయం నా పాత గర్ల్ ఫ్రెండ్స్ ఎంతో మంది చెప్పినా నేను వదల్లేదు.. ఇప్పుడు సడెన్‌గా చెప్పి కంట్రోల్ చెయ్ అంటే నేనేం చేయాలి అంటూ తన ఫ్రస్ట్రేషన్ చెప్పుకున్నాడు నిఖిల్.

తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో ఇంతకుముందెప్పుడూ జరగని ఓ సంఘటన నిన్న జరిగింది.. మీలో కొంతమంది నేరుగా బిగ్‌బాస్ నిర్ణయాలను సవాల్ చేయడంతో పాటు.. పదే పదే అమర్యాద పూర్వకంగా ప్రవర్తించారు.. దీని పర్యావసానం మీ క్లాన్ నుంచి అందరూ చీఫ్ కంటెండెర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు అంటూ షాకిచ్చాడు. తర్వాత రెడ్ ఎగ్‌ను సోనియాకి ఇచ్చేయగా చీఫ్ పదవికి సోనియా మీతో తలపడతారు అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు.

Also Read:Bigg Boss 8 Telugu:గొడవలు, బూతులు ఇంటి సభ్యుల రచ్చ

కాసేపటికీ నిఖిల్-సోనియాలకి నిదానమే ప్రదానం అనే టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. ఒకవైపు నుంచి మరోవైపుకి మోకాళ్లు చేతుల సాయంతో పాకుతూ మీ నడుముకున్న ప్లేట్స్ మీద ఎక్కువ బాల్స్‌ను అటువైపు తీసుకెళ్లాలి అని చెప్పగా ఈ టాస్క్‌లో నిఖిల్ గెలిచాడు. దీంతో మరోసారి శక్తి టీమ్‌కి చీఫ్ అయిపోయాడు.

- Advertisement -