Bigg Boss 8: నిఖిల్ జర్నీ వీడియో

1
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 103 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నిఖిల్ జర్నీని చూపించారు. నిఖిల్ ఆడిన టాస్కులు సహా పలు ఇంపార్టెంట్ జర్నీ విశేషాలను ఫొటోల రూపంలో చూపించాడు బిగ్‌బాస్. ప్రత్యర్థులతో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటని వేలెత్తి చూపినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు.. ఎందుకంటే మీరు మీ స్నేహం కోసం ఆడారు.. కానీ మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం అన్నారు.

మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు.. అప్పుడు మీ మనసుకి అయిన గాయాన్ని మీలోనే దాచుకున్నారు .. మిమ్మల్ని చాలా మంది సేఫ్ గేమర్ అని నిందించారు.. కానీ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోరన్న విషయాన్ని వాళ్లు గ్రహించలేకపోయారు అన్నారు.

రాయల్స్ ఇంట్లోకి ఎంటరైనప్పుడు విచ్ఛిన్నమైన ఓజీలని ఒకతాటిపైకి తీసుకొచ్చారు..మీ కన్నా ఇంటి కోసమే ఎక్కువ ఆలోచించారు.. సరదాకి మీరు ఏం చేసినా హద్దులు దాటలేదు.. ఈ లక్షణాలే మిమ్మల్ని చివరి మజిలీకి అతి చేరువలో నిలిపింది అన్నారు.

తన జర్నీని చూసి కూడా నిఖిల్ ఎమోషన్‌ను బాగానే కంట్రోల్ చేశాడు. మాటలు రావడం లేదు బిగ్ బాస్.. చాలా వండర్ ఫుల్ జర్నీ.. ఎక్కడ వీక్ అయ్యానో అక్కడే స్ట్రాంగ్ అయ్యాను.. నా వీక్ పార్ట్ ఎమోషన్.. ఎక్కువ ఎక్కడ ఏడ్చానో అక్కడే ఒక్క చుక్క నీళ్లు కూడా రాకుండా కంట్రోల్ చేస్తున్నాను.. నన్ను ఈ స్థాయిలో నిల్చోబెట్టిన ఆడియన్స్‌కి థాంక్యూ అన్నాడు బిగ్ బాస్.

Also Read:TTD: కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం

- Advertisement -