Bigg Boss 8: గౌతమ్‌ని హీరో చేసిన బిగ్ బాస్

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 102 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో గౌతమ్ జర్నీని చూపించారు బిగ్ బాస్. పంచెకట్టుకొని గార్డెన్ ఏరియాలోకి గౌతమ్ ఎంట్రీ ఇవ్వగానే అక్కడ సెటప్ చూసి సర్‌ప్రైజ్ అయ్యాడు. గౌతమ్ గెలిచిన టాస్కులకి సంబంధించిన వస్తువులు, తన బిగ్‌బాస్ జర్నీలో కీలకమైన సన్నివేశాల ఫొటోలతో చాలా అద్భుతంగా అంతా డెకరేట్ చేశారు.

గౌతమ్‌ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు బిగ్‌బాస్. గౌతమ్.. బలవంతుడితో ఎలాగోలా గెలవచ్చు కానీ మొండోడితో గెలవలేము అనే సామెత మీకు తెలుసా.. మనం నమ్మిన దాని గురించి బలంగా నిలబడి.. ఏమైనా ఫర్లేదు అని పోరాడే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.. అందులో మీరు ఒకరు. లక్ష్యాన్ని ఛేదించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లో బలమైన కంటెస్టెంట్లు కూడా ఇబ్బంది పడ్డారు.. స్త్రీల పట్ల మీకున్న గౌరవం ఈ ఆటలో మీ మాటలో స్పష్టంగా ప్రతిబింబించింది అని చెప్పారు.

మీకు మానవ సంబంధాలు లేవని.. ఆడియన్స్ కోసమే ఆడతారంటూ కొందరూ ఎన్ని మాటలన్నా.. మీ పంథా మార్చకండా మీ లక్ష్యం వైపు కదిలారు.. ఫైనలిస్టుగా మీ చివరి మజిలీకి చేరుకున్నారు అంటూ బిగ్‌బాస్ ప్రశంసించాడు.ఈ జర్నీ వీడియోని చూసి గౌతమ్‌కి మాటలే రాలేదు. ఇక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్క పాఠం గుర్తుంచుకుంటా.. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మా నాన్న గురువు చాలా ముఖ్యం.. నాకు మీరే గురువు బిగ్‌బాస్.. మీకు శతకోటి పాదాభివందనాలు అంటూ నిజంగానే పాదాభివందనం చేశాడు.

Also Read:Kavitha:బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి

- Advertisement -