Bigg Boss 8 Telugu: ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరో తెలుసా!

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 5వ వారంలోకి ఎంటరైంది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఆరుగురు ఉండగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక వచ్చే వారం హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఉం డనుండగా ఇందుకు సంబంధించి తొలి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఎవరనేది రీవిల్ అయింది. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ టేస్టీ తేజా పేరును అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తేజా ఫేస్ రివీల్ చేయకుండా.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ ఎవరో కనిపెట్టండి అంటూ అతని నీడను మాత్రమే రివీల్ చేశారు. ఇంత బొజ్జ వేసుకున్న ఆ పొట్టి పురుషుడు టేస్టీ తేజానే అని ఎవరైనా గుర్తుపట్టేస్తారు.

బిగ్ బాస్ 7లో తొమ్మిదోవారం ఎలిమనేట్ అయ్యారు టేస్టి తేజా. అయితే అప్పటివరకు 8 మంది ఎలిమినేట్ కాగా అందులో ఆరుగురు తేజా ఎలిమినేట్ చేసిన వాళ్లే కావడం విశేషం.

Also Read:రామ్ చ‌ర‌ణ్ గొప్ప డాన్సర్: శంక‌ర్‌

- Advertisement -