Bigg Boss 8: గౌతమ్ ఫ్యాన్స్ నిరసన

2
- Advertisement -

బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా పూర్తయింది. 105 రోజుల పాటు సాగిన ఈ రియాల్టీ షో విజేతగా నిఖిల్‌ నిలవగా రన్నరప్‌గా గౌతమ్ నిలిచారు. తెలుగు బిగ్ బాస్‌లో తెలుగు వాడిని కాకుండా న్నడ కంటెస్టెంట్‌ని విన్నర్‌ని చేయడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా గౌతమ్ అభిమానులు అన్నపూర్ణ స్టుడియో దగ్గరకు భారీగా చేరుకుని నిరసన తెలిపారు.

అయితే గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన దాడుల నేపథ్యంలో అన్నపూర్ణ స్టుడియో దగ్గరకు ఎవరూ రాకూడదని.. ఎలాంటి విజయోత్సవారాలు, ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేయడమే కాదు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజాగా గౌతమ్ అభిమానులు సైతం పెద్ద ఎత్తున చేరుకోగా పోలీసులు అలర్ట్ అయ్యి.. అభిమానుల్ని చెదరగొట్టారు. నిఖిల్ గెలిచింది ఆడియన్స్ ఓట్ల వల్ల కాదని.. కేవలం స్టార్ మా సీరియల్స్ చేస్తున్నాడు కాబట్టేనని ఆరోపించారు.

Also Read:KTR: రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ సెటైర్‌

- Advertisement -