Bigg Boss 8: విష్ణుప్రియ ఎలిమినేట్

5
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 98 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ‘ప్రైజ్ మనీ ఎంత’ అంటూ ప్రశ్నించారు నాగార్జు. రూ.54 లక్షల 30 వేలు అంటూ అందరూ చెప్పారు. అయితే అది ఫిక్స్ కాదు.. యాడ్ అవ్వొచ్చు తగ్గొచ్చు.. ఒకరు ఈరోజు వెళ్లిపోతారు అని చెప్పాడు.

తొలుత అవినాష్ నిల్చొని తానే విన్నర్ అయితే ఆ ప్రైజ్ మనీ ఏం చేస్తాడో చెప్పాడు.ఈ ప్రైజ్ మనీతో మా అన్నయ్య కూతురు పెళ్లి చేద్దామనుకుంటున్నా.. అన్నకి ముగ్గురు కూతుళ్లు.. పెద్దమ్మాయ్ పెళ్లి చేద్దామనుకుంటున్నా.. అంటూ అవినాష్ చెప్పాడు. రోహిణికి కారు కొనేసి ఇస్తా అని మాట ఇచ్చావ్ కదా అంటూ నాగ్ ఇరికించారు. అవును సార్ అది కూడా కొంటా అంటూ అవినాష్ అన్నాడు.

నబీల్ లేచి నా కల సినిమా.. నాకు తోచిన డబ్బుతో సినిమా తీసుకుంటా.. మంచి సినిమా తీస్తా సార్ అని చెప్పాడు. . నిఖిల్ నేనే విన్నర్ అయితే ప్రైజ్ మనీతో అప్పులు తీర్చేస్తా సార్.. అలానే ఇప్పటివరకూ మాకు సొంతిల్లు లేదు .. చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం.. కనుక అమ్మ వాళ్లకి ఇల్లు కట్టిస్తా అంటూ నిఖిల్ చెప్పాడు. చివరిగా గౌతమ్‌ని అడగ్గా లాస్ట్ సీజన్‌లో కూడా చెప్పా సార్.. అమ్మ రిటైర్ అవుతున్నారని.. కనుక తనకి సేవింగ్స్‌లా ఉండాలని ఇందులో 50 పర్సంట్ అమ్మకి ఉపయోగిస్తా.. ఇక రూ.10 లక్షలు గంగవ్వకి ఇస్తా అని చెప్పాడు.

ఆ తర్ఆవత సెకండ్ ఫైనలిస్ట్ ఎవరనేది రివీల్ చేశారు నాగ్. నిఖిల్ పేరు చెప్పగానే ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత గౌతమ్ ఈజ్ థర్డ్ ఫైనలిస్ట్ అంటూ నాగార్జున ప్రకటించారు. ఇక ఈ వారం విష్ణుప్రియ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

Also Read:విద్యార్థులతో మాజీ ఎంపీ సంతోష్ బర్త్ డే వేడుకలు

- Advertisement -