పల్లవి ప్రశాంత్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

190
- Advertisement -

బిగ్ బాస్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు. అమర్ దీప్ – ప్రశాంత్ మధ్య చివరి వరకు పోటీ జరుగగా విజేతగా నిలిచారు ప్రశాంత్. బిగ్‌బాస్ విజేతకు 50 లక్షలు అని ప్రకటించినా దాంట్లో 15 లక్షలు ఓ కంటెస్టెంట్ ని బయటకి పంపడానికి తీశారు. ఆ డబ్బులు యావర్ తీసుకొని వెళ్ళిపోయాడు యావర్.

విన్నింగ్ అమౌంట్ 35 లక్షలు అందుకున్నారు ప్రశాంత్. రెమ్యునరేషన్ 15 వారాలకు 15 లక్షలు అని సమాచారం. అలాగే ఓ మారుతి బ్రేజా కార్, ఓ డైమండ్ నెక్లెస్ కూడా గెలుచుకున్నారు. ఫైనల్ లో ఆరో ప్లేస్ లో అంబటి అర్జున్ నిలవగా, ఐదో ప్లేస్ లో ప్రియాంక జైన్, నాలుగో ప్లేస్ లో యావర్, మూడో ప్లేస్ లో శివాజీ, రెండో ప్లేస్ లో అమర్ దీప్ నిలిచారు.

హౌస్ లో కూడా రైతు బిడ్డ, రైతు బాధలు అని సింపతీతో పాపులర్ అయి విన్నింగ్ వరకు వచ్చాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచారు.

Also Read:బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా పల్లవి ప్రశాంత్

- Advertisement -