అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా స్టార్ట్ అయింది. ఆదివారం సీజన్ గ్రాండ్‌గా ప్రారంభంకాగా ఈ సారి కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుండగా డిస్నిప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు లైవ్ తో స్ట్రీమ్ కానుంది.గత సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే మొత్తం 20 మంది హౌస్ లోని వెళ్లగా ఈ సారి 14 మందిని లోపలికి పంపించారు.
ఇక ఈ సారి సీజన్ కొత్తగా ఉండబోతుందని అంటే ఉల్టా పల్టా అంటూ నాగార్జున మొదటి నుండి అంచనాలను పెంచేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటింగ్ విషయంలో కూడా ఎవరూ ఊహించని ఉల్టా పుల్టా న్యూస్ చెప్పారు. ఈ సీజన్‌లో ఒక్కో కంటెస్టెంట్‌కి ఓటర్స్ ఒక్కో ఓటు మాత్రమే వేయాల్సి ఉంటుంది. హాట్ స్టార్, మిస్డ్ కాల్స్ ద్వారా ఒక్కొక్కరికి ఒక్కో ఓటు మాత్రమే ఉంటుందని తెలిపారు.
నిజానికి బిగ్ బాస్ ఓటింగ్‌పై విమర్శలు ఎప్పుడు వస్తుంటాయి. మంచిగా ఆడే కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేస్తున్నారనే విమర్శలు వచ్చేవి. దీనికి తోడు పదేసి ఓట్లు చొప్పున వేసే అవకాశం ఉండటంతో.. ఫేక్ అకౌంట్లతో ఓట్లు వేసే అవకాశం కూడా ఉండేది. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టి.. ప్రేక్షకులకు మళ్లీ బిగ్ బాస్ ఓటింగ్‌పై నమ్మకం కలిగించడానికి సింగిల్ ఓటింగ్ విధానాన్ని తెరపైకి తెచ్చారు.
Also Read:MLC Kavitha:గులాబీ జెండా ఎగరాలి