Bigg Boss 7 Telugu:టైమింగ్స్ చేంజ్

36
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ సో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటివరకు 6 సీజన్‌లకు మంచి స్పందన రాగా ఇక 7వ సీజన్‌ను ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఇప్పటికే ప్రారంభించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు హోస్ట్ నాగార్జున. సరికొత్తగా ఈ సారి ఉండబోతుందని క్యూరియాసిటీ పెంచేశారు.

సెప్టెంబర్‌ 3న 7వ సీజన్ ప్రారంభంకానుండగా ‘ఉల్టా పుల్టా’ అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో గేమ్‌ షోను ప్లాన్‌ చేశారని సమాచారం. ఇక ఈ సారి షో లాంఛింగ్‌ టైమింగ్స్‌తో పాటు టెలికాస్ట్‌ టైమింగ్స్‌ను మార్చారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Also Read:కొత్తిమీరతో ప్రయోజనాలెన్నో..!

సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం అవుతుందని స్టార్‌ మా ప్రకటించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో షో ప్రసారమవుతుందని…శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు షో టెలికాస్ట్‌ కానుంది. గత సీజన్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేసేవారు. దీనిలో మార్పులు చేశారు.

ఈసారి కంటెస్టెంట్స్‌లో అమర్‌ దీప్‌, కార్తీక దీపం ఫేమ్‌ శోభా శెట్టి, శ్వేతానాయుడు, సింగర్‌ మోహన భోగరాజు, సింగర్‌ శుభశ్రీ, సింగర్‌ దామిని, యూట్యూబ్‌ సెన్సేషన్‌ శీతల్‌ గౌతమన్‌, కమెడియన్‌ మహేష్‌, శుభశ్రీ, అంజలి పవన్‌, పల్లవి ప్రశాంత్‌ (యూట్యూబర్‌), మై విలేజ్‌ షో (అనిల్‌ గీలా), ఆర్కే సాగర్‌ ల పేర్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -