Bigg Boss 7 Telugu:టేస్టి తేజా ఎలిమినేట్

28
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 63 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్ అంటే 9వ వారం ఇంటి నుండి అంతా ఊహించినట్లుగానే టేస్టి తేజా ఎలిమినేట్ అయ్యారు.ఇక వీకెండ్, సన్ డే ఫన్ డే కావడంతో లారెన్స్, డైరెక్టర్ ఎస్‌జే సూర్య గెస్టులుగా వచ్చి సందడి చేశారు. ఇక ఎలిమినేషన్‌లో చివరగా రతిక-తేజ మిగిలిపోగా తేజ ఎలిమినేటెడ్ అంటూ నాగ్ ప్రకటించారు. తేజ ఎలిమినేట్ కాగానే శోభా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వారిని పలకరిస్తూ గుడ్ బై చెప్పాడు తేజ.

శోభా దగ్గరికెళ్లి నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ.. తెలిసో తెలియకో చేసి ఉంటాను.. హర్ట్ అయి ఉంటే క్షమించు అన్నాడు. ప్రియాంకకి కూడా హగ్ ఇచ్చి గుడ్‌బై చెప్పగా యాపర్‌తో బై బడ్డీ బాగా ఆడూ అంటూ వెళ్లిపోయాడు. శివాజీ దగ్గరికెళ్లి బై అన్నా వెళ్లొస్తానంటూ తేజ అన్నాడు. దీంతో నో హార్ట్ ఫీలింగ్స్‌రా గేమ్‌లో భాగంగానే చేశా అంటూ శివాజీ చెప్పడంతో అయ్యో అలా ఏం లేదున్నా గేమ్ పరంగా చేశావ్ అని చెప్పాడు.

తర్వాత స్టేజ్ మీదకి వచ్చాక తన జర్నీ వీడియో చూసి తేజ ఎమోషనల్ అయ్యాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉండాలని అనుకున్నాను కానీ అవ్వలేదు అంటూ తేజ చెప్పాడు. తర్వాత హౌస్‌లో ఉన్న ఒక్కొక్కరికి 10కి ఎన్ని మార్కులు వేస్తావని నాగార్జున అడిగారు. ముందుగా శోభాకి ఎన్ని ఇస్తావ్ అని నాగ్ అడిగితే శోభాకి 10కి 20 మార్కులు ఇచ్చేయొచ్చు సార్ అన్నాడు. ప్రియాంక గురించి చెబుతూ హౌస్‌లో వంటలక్క బిరుదు ప్రియాంకకే ఇస్తా సార్. నేను హౌస్‌లో ఉన్న అమ్మాయిలందరినీ ఏమే, ఓసేయ్ అంటూ మాట్లాడతా సార్.. కానీ ప్రియాంకని మాత్రం ఇప్పటివరకు అలా అనలేదు అని చెప్పాడు. శివాజీ మాట్లాడుతూ తేజ కంటే తెలివైనవాడు హౌస్‌లో ఎవరూ లేరు.. మీ నాన్నలా చెబుతున్నాను నువ్వు వెళ్లాక ఒకసారి మొత్తం ఎపిసోడ్స్ చూడు ఏం తప్పులు చేశావో అర్థమవుతుంది అంటూ శివాజీ అన్నాడు. తర్వాత హౌస్ నుండి వెళ్లిపోయాడు తేజ.

Also Read:పిక్ టాక్ : టైట్ ఫిట్ లో అందాల వల

- Advertisement -