Bigg Boss 7 Telugu:ఈ వారం నామినేషన్స్‌లో 8మంది

49
- Advertisement -

ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7…8వ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. వాడివేడిగా జరిగిన ఈ వారం ఎలిమినేషన్స్‌లో శోభా శెట్టి,భోలే షావలి,శివాజీ,అశ్విని శ్రీ,ప్రియాంక జైన్,అమర్‌ దీప్,సందీప్,గౌతమ్ ఉన్నారు. ఇక శివాజీ నామినేషన్స్ ప్రక్రియ అంతా ముగిసాక ఎవరినో ఒకరిని కొట్టి నేనే వెళ్లిపోతా అన్నారు. దీంతో షాకయ్యారు.

దొంగలు.. దొంగ దొంగ అని పరిగెట్టిస్తున్నారే.. చూస్తా ఇప్పుడన్నా మనుషులు, జనాలు అనే వాళ్లు ఉంటే చూస్తా ఈ వారం.. ఈ వారాన్ని బట్టి ఈ హౌస్‌లో ఉండాలా లేదో చూస్తా.. న్యాయం కాకపోతే తర్వాత వాలంటరీగా ఎవడొకడ్ని కొట్టి నేనే వెళ్లిపోతా అని చెప్పాడు. మొత్తం హౌస్ అంతా డిస్ట్రబ్ అవుతుంది.. ఈ వారం తెలుస్తుంది.. పర్ఫెక్ట్‌గా పడ్డాయి నామినేషన్లు.. ఈ వారం తెలుస్తుంది.. ఎవరు ఏంటో అని శివాజీ అన్నాడు.మొత్తంగా నామినేషన్స్ అయిపోయిన తర్వాత నీకొక నమస్కారం బాబూ అంటూ బిగ్‌బాస్‌తో అన్నాడు శివాజీ.

Also Read:సోదరా.. మోషన్ పోస్టర్

ఇక భోలే విషయంలో శోభా సైకో మోనిత కంటే దారుణంగా ప్రవర్తించింది. నాకు ఒక మాట దగ్గర ఎక్కువ రియాక్ట్ అయ్యారేమో అనిపించింది అని తేజ అనగా దీనికి అశ్విని కోపంగా ఆయనేంటి (భోలే) నా అన్న.. నా అన్న లాగ అంటూ అరిచింది.

- Advertisement -