Bigg Boss 7 Telugu:ఓటింగ్‌లో వెనుకబడ్డ అమర్

40
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 96 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఓటు కోసం అప్పీల్ చేశారు అమర్ దీప్, అర్జున్. వీరిద్దరిలో ఒకరిని ఓటు ద్వారా ఎంపిక చేయాలని..ఆ ఓటు ఇంటి సభ్యులే వేయాలని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ క్రమంలో అమర్‌దీప్‌ని నిలదీశారు ప్రశాంత్. తన ఓటు అర్జున్‌కేనని..నీకెందుకు సపోర్టు చేయాలో ఒక్క రీజన్ చెప్పాలని అర్జున్‌ని నిలదీశారు ప్రశాంత్.నీకు సపోర్ట్ చేస్తే చేయలేదని అన్నావ్.. ఇప్పుడు నీకు సపోర్ట్ చేసినా చేయలేదనే అంటావ్.. అందుకే అర్జున్‌కి సపోర్ట్ చేస్తున్నా అఅని చెప్పాడు.

తర్వాత వచ్చిన శోభా అమర్‌కి సపోర్టు చేశాడు. తర్వాత తన సపోర్ట్ అర్జున్‌కే అన్నాడు శివాజీ. తను ఓటింగ్‌లో లాస్ట్‌లో ఉన్నాడు.. ఓటు అప్పీల్ అతనికి అవసరం అందుకే అతనికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పారు. ఒకడేమో ఇద్దరికీ అవసరం అంటాడు.. మీరేమో అవసరం లేదని అంటారు అని అమర్ అనడంతో నువ్వు మాత్రం ఏమన్నావ్ రా.. నువ్వేమన్నా ఇద్దర్నీ చేశావా? ఒకరికే కదా సపోర్ట్ చేశావ్.. మరి మేం చేయొద్దా? అని కౌంటర్ ఇచ్చాడు శివాజీ. నువ్వు ఇలాంటి మాటలు చాలాసార్లు చెప్పావ్ రా.. నీకు అనుకూలంగా వందసార్లు మార్చుకున్నానని నువ్వే చెప్పావ్.. ఇప్పుడు నువ్వు రకరకాలు మాటలు మార్చితే నేనూ మార్చాల్సి ఉంటుంది అని చెప్పాడు.

Also Read:రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు

తర్వాత యావర్ కూడా అర్జున్‌కే సపోర్టు చేశాడు. లాస్ట్ వీక్ ఆయనకి తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పాడు యావర్. దీంతో యావర్‌తో వాదనకు దిగాడు అర్జున్. ఎందుకురా డ్రామా.. ఇప్పటికీ అర్జున్ నాతో మాట్లాడటం లేదు.. నేను అర్జున్‌తో మాట్లాడటం లేదు కాబట్టి ఇందులో ఎలాంటి గేమ్ లేదని కౌంటర్ ఇచ్చేశాడు యావర్. అమర్ అంటే ఎవడు?? అమర్ గుండెలపై ఏముంది? కెప్టెన్ బ్యాడ్జ్ ఉంది చూడారా? అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు అమర్. నువ్వు కెప్టెన్ అయితే ఏంటి? నీకో రూలూ మాకో రూలా?? అనగానే మీసాలు మెలేస్తూ మరింత రెచ్చిపోయాడు అమర్. తర్వాత ప్రియాంక..అమర్‌కి సపోర్టు చేసింది.చివరికి ప్రశాంత్, శివాజీ, యావర్‌లు అమర్‌కి వ్యతిరేకంగా ఓటు వేయడంతో.. ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం అర్జున్‌కి ఇచ్చారు బిగ్ బాస్.

తర్వాత అర్జున్.. ఆడియన్స్ ఓటు అప్పీల్ చేశాడు. బలంతో పాటు బలగం కూడా కావాలని నాకు తెలిసి వచ్చింది. నేను ఎవరి సపోర్ట్ లేకుండా పవర్ అస్త్ర గెల్చుకున్నాను.. ఈ హౌస్‌లో ఉన్నాను. నా ఆటతో పాటు.. మీ ఓట్లు కూడా అవసరం దయచేసి నాకు ఓట్లు వేయండి అని అభ్యర్ధించాడు అర్జున్.

- Advertisement -