Bigg Boss 7 Telugu:అర్జున్ వర్సెస్ ప్రశాంత్ మధ్యలో ప్రియాంక

40
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 94 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా అర్జున్ – అమర్‌ మధ్య బీభత్సమైన గొడవ జరగ్గా వీరిద్దని గలీజ్ ఫెల్లోస్ అంటూ నోరు జారింది ప్రియాంక. ఇక బిగ్ బాస్ అర్జున్ కోసం ఏకంగా 2 కేజీల కేక్ పంపించాడు. దీంతో ఇంత కేక్ ఒక్కడినే తినాలా అంటూ మెల్లిమెల్లిగా తినడం స్టార్ట్ చేశాడు. సగం తినేసరికి అర్జున్ పని అయిపోగా ఇంటి సభ్యుల్లో ఒకరి హెల్ప్ తీసుకోవాలని చెప్పాడు. యావర్ హెల్ప్‌తో మొత్తం లాగించేశాడు అర్జున్.

తర్వాత కిచెన్‌లో ప్రశాంత్‌తో గొడవకు దిగింది శోభా శెట్టి. గార్డెన్ ఏరియాలోకి వచ్చిన ప్రశాంత్.. ఈ విషయం శివాజీకి చెప్పాడు. వదిలేరా వేస్ట్ క్రీచర్స్ (పురుగుల) అవన్నీ.. వాళ్లు ఎప్పుడైనా నిన్ను పొగుడుతారా వాళ్లు నెగెటివ్ మనుషులురా అంటూ ప్రశాంత్‌తో చెప్పాడు శివాజీ . ఇక అమర్‌..యవార్‌ని టార్గెట్ చేస్తూ పనులన్ని అతడికే చెప్పాడు. తర్వాత అందరినీ కూర్చోబెట్టి ఓ కథ చెప్పారు బిగ్ బాస్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఒకరి పేరు బేబీ, మరొకరు బీబీ.. నేను షాపింగ్‌కి వెళ్తున్నాను.. వచ్చే వరకూ నా పిల్లలకి ఏం కావాలో అవి చేసి పెట్టండి.. వాళ్లను సంతోషంగా ఉంచండిం అంటూ రెండు బొమ్మలు పంపించాడు బిగ్‌బాస్. ఇక ఒక్కొక్కరి యాక్టింగ్‌ మాములుగా లేదు.

కొద్దిసేపటి తర్వాత అమర్‌ ఏం చెబితే అందరూ అది చేయాలని చెప్పగా ఇంటి సభ్యులతో ఆడుకున్నాడు అమర్. ప్రియాంక చేతికి ఒక గిన్నె ఇచ్చి స్పూన్‌తో స్విమ్మింగ్‌పూల్‌లో నీళ్లు ఇందులో పట్టమన్నాడు. తర్వాత ఓట్ అప్పీల్‌కి ఛాన్స్ గెలుచుకునేందుకు ఒక గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ఇసుకతో చేసిన కేకుపై ఒక చెర్రీ పెట్టాడు ఇక.కేక్‌పై ఉన్న చెర్రీ కింద పడకుండా కేకును ఒక్కొక్కరూ కట్ చేస్తూ ఉండాలి. ఎవరు కట్ చేసినప్పుడు ఆ చెర్రీ కిందపడితే వాళ్లు గేమ్ నుంచి తప్పుకుంటారు అని చెప్పాడు. ఓట్ అప్పీల్ కోసం మొదటి కంటెండర్‌గా అమర్ నిలిచాడు.

రెండో గేమ్ ప్రకారం గార్డెన్ ఏరియాలో ఉన్న గంటని బజర్ మోగిన వెంటనే ఎవరు ఫస్ట్ కొడతారో వాళ్లు విన్ అవుతారు. ఇక బజర్ మోగిన వెంటనే పక్కనే పరిగెడుతున్న ప్రశాంత్‌ని చేతితో ఆపేశాడు అర్జున్. దీంతో అర్జున్ చేయి ప్రశాంత్ దవడ మీద తగిలింది. దీంతో ప్రశాంత్ వెంటనే అర్జున్‌ని ఆపే ప్రయత్నం చేశాడు. మొత్తానికి అర్జున్ బెల్ కొట్టాడు. ఇక తనని కావాలని ఆపేశాడంటూ ప్రశాంత్ గొడవకి దిగాడు. ఇదే క్రమంలో ప్రియాంక్ …అందరూ లాగారు గలీజ్ ఫెలోస్ అంటూ తిట్టింది.

Also Read:దూత …అద్భుతమైన స్పందన

- Advertisement -