బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 విజయవంతంగా 40 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి వచ్చిన అంబటి అర్జున్…పల్లవి ప్రశాంత్‌పై విషం గక్కాడు. వాడో వెర్రిపుష్పం.. నలిపేయాల్సింది అంటూ మండిపడ్డాడు. హౌస్‌లోకి వచ్చిన వెంటనే అమర్ దీప్‌కి చెక్ పెట్టాడు అర్జున్. ఇప్పుడు ప్రశాంత్, శివాజీలను టార్గెట్ చేశాడు.
ఈ వీక్‌లో ప్రశాంత్ కెప్టెన్ కాబట్టి అర్జున్ …. ప్రశాంత్‌ని పిలిచి అందరికీ పనులు చెప్తున్నావ్.. మరి శివాజీకి ఎందుకు చెప్పడం లేదు.. బయట చూసే వాళ్లకి బాగోదు. అన్నాడు. ఆయనకి చేయి బాలేదు కదా.. అందుకే ఏం చెప్పడం లేదు అని అనడంతో.. చేయి బాలేకపోతే.. చేతికి పనిలేకుండా ఉండే పని చెప్పు.. హౌస్ సూపర్ వైజ్ చేయమను.. యావర్ తెలుగులో మాట్లాడటం.. తేజా పడుకోకుండా చూడటం లాంటివి చేయమను.. వాటి వల్లే కదా.. నీకు కెప్టెన్సీ పోయేది.. కనీసం ఆ పనులైనా చేయమను అని చెప్పకొచ్చాడు.
తర్వాత శివాజీ దగ్గరకు వెళ్లి సూపర్ వైజ్ చేయమని రిక్వెస్ట్ చేశాడు ప్రశాంత్ దానికి శివాజీ సరేనని అన్నాడు. ఈ క్రమంలో అర్జున్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో రెచ్చిపోయాడు. వీళ్లంతా నాతో ముఖాముఖి గేమ్ ఆడాలని చూస్తున్నా.. ఆడదాం అంటూ ఆడలేరు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. పోటుగాళ్లు టీం మంచిగా నడిపిస్తూ.. తనలో లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నట్టుగానే ఆట ఆడారు. కానీ లైవ్ ఎపిసోడ్‌లో మాత్రం.. తనలోని షేడ్స్ బయటపెట్టాడు.
ఈ వెర్రి పుష్పం గాడికి రేపు బట్టలు ఇస్తానని చెప్తే.. శివాజీ అన్నని అడిగి వేసుకుంటానంటాడేంటి? అంటూ నోరుజారాడు అర్జున్. అంతటితో ఆపలేదు.. గౌతమ్‌తో.. అసలు మొన్నటి కలర్స్ టాస్క్‌లోనే వాడ్ని మడత పెట్టేయాల్సింది.. ఎందుకు వదిలేశావ్ అంటూ తన మనసులోని విషం మొత్తం గక్కేశాడు.
Also Read:#గోపీచంద్32.. మిలాన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి