Bigg Boss 7 Telugu:ఈ వారం నామినేషన్‌లో 7గురు

42
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా మూడోవారంలో ఎంటరైంది.సోమవారం కావడంతో నామినేషన్ ప్రక్రియలో మళ్లీ రచ్చ జరిగింది. 14 మంది హౌస్‌లో అడుగుపెట్టగా వారిలో ఇద్దరు కిరణ్, షకీలా తొలి రెండు వారాల్లో ఇంటి నుండి బయటికొచ్చారు. ఇక మూడోవారంలో 7 గురు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. హౌస్‌లో ఉండటానికి అర్హత లేదనుకునే సభ్యుల్ని నామినేట్ చేస్తూ.. వాళ్ల ముఖంపై నురుగ స్ప్రే చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు.

దీంతో ఒకరి ముఖాలపై ఒకరు స్ప్రే చేసుకుని రచ్చచేశారు. తొలుత టేస్టీ తేజాని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేయగా యావర్‌, గౌతమ్‌లను ప్రియాంక నామినేట్ చేపింది. దామిని .. ప్రిన్స్ యావర్‌ని నామినేట్ చేస్తూ తన బిహేవియర్ నచ్చలేదని చెప్పగా ఆ మాటలు వెనక్కి తీసుకోని కోపంతో చెప్పాడు యాపర్. నేను తీసుకోనని దామిని చెప్పడంతో యావర్ రెచ్చిపోయాడు. పిచ్చిపట్టినట్లు అరచి తన కోపాన్ని ప్రదర్శించాడు.

తర్వాత శోభాశెట్టి.. రతికను శుభశ్రీని నామినేట్ చేయగా అమర్ దీప్.. శోభ శ్రీని నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం శుభ శ్రీ రాయగురు, ప్రియాంక, దామిని, అమర్ దీప్, యావర్ , గౌతమ్ కృష్ణ,రతిక రోజ్ లు నామినేట్ కాగా వీరిలో ఒకరు హౌస్ నుండి బయటకురానున్నారు.

పవరాస్త్ర అందుకున్న ఫైనల్ కంటెస్టెంట్స్ శివాజీ, ఆట సందీప్‌లకు స్పెషల్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. నామినేట్ అయిన ఈ ఏడుగురిలో ఒకర్ని సేవ్ చేసి.. ఆ ప్లేస్‌లో మరొకర్ని స్వైప్ చేయొచ్చని చెప్పారు. దీంతో సందీప్, శివాజీలు ఏకాభిప్రాయంతో టేస్టీ తేజాని నామినేషన్స్ నుంచి తప్పించి.. ఆ ప్లేస్‌లో అమర్ దీప్‌ని స్వైప్ చేశారు. దీంతో అనూహ్యంగా నామినేషన్‌లోకి వచ్చాడు అమర్ దీప్.

Also Read:KTR:తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ

- Advertisement -