బిగ్‌బాస్‌ 6లో పాల్గొనాలనుకుంటున్నారా??

56
nagarjuna
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 5 సీజన్లు పూర్తిచేసుకుని 6వ సీజన్‌ ప్రారంభానికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. సాధారణంగా ఈ షోలో పాపులర్ వ్యక్తులు, సెలబ్రిటీలను తీసుకొస్తూ ఉంటారు. అయితే ఈ సారి షోలో సామాన్యులకి కూడా అవకాశం కల్పించనున్నారు.

6వ సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనుండగా ఇందుకు సంబంధించి వీడియోను రిలీజ్ చేశారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ఈ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం. ఇన్నాళ్లు మీరు బిగ్‌బాస్‌ షోను చూశారు, ఆనందించారు. ఇప్పుడు మీరు కూడా ఆ ఇంట్లో ఉండొచ్చు అని తెలిపారు.

అందుకే స్టార్‌ మా ఇస్తోంది ఆకాశాన్ని అందుకునే అవకాశం, వన్‌ టైం గోల్డెన్‌ ఛాన్స్‌. టికెట్‌ టు బిగ్‌బాస్‌ సీజన్‌ 6. మరిన్ని వివరాల కోసం స్టార్‌ మా వారి వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవండి అని తెలిపారు.

- Advertisement -