- Advertisement -
బుల్లితెర రియాల్టీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 అప్‌డేట్ వచ్చేసింది. గత మూడు సీజన్ల నుంచి హోస్ట్‌గా ఉంటున్న నాగార్జున ఈ సారి హోస్ట్‌గా వ్యవహరించనుండగా తాజాగా లోగోని రివీల్ చేశారు. అయితే ఎప్పటినుండి మొదలవుతుంది అనే తేదీని మాత్రం ప్రకటించలేదు.
అయితే ఈసారి బిగ్ హౌస్‌లోకి వెళ్లే వారిలో కొంతమంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో యాంకర్ మంజూష, హీరోయిన్ ఆశా సైనీ, హీరో లక్ష్, ట్రాన్సజెండర్ తన్మయి, న్యూస్ యాంకర్ పద్మిని, ఆర్టిస్ట్ సంజన చౌదరి, యూట్యూబ్ ఆర్టిస్ట్ కుషిత, యాక్టర్ భరత్, సీరియల్ ఆక్టర్ కౌశిక్, హీరో సుమంత్ అశ్విన్ ఉన్నారు.
అలాగే హీరోయిన్ ప్రీతీ అస్రానితో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో బిగ్ బాస్ షోపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా ఈసారి నిర్వాహకులు వాటిని ఎలా అధిగమిస్తారో వేచిచూడాలి..
- Advertisement -