బిగ్ బాస్ 6..రేవంతే టార్గెట్!

80
revanth
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా ముందుకుసాగుతోంది. తొలివారం నామినేషన్స్ ప్రక్రియతో ఇంట్లో మాటలయుద్ధం తారాస్థాయికి చేరగా అంతా సింగర్‌ రేవంత్‌ని టార్గెట్ చేశారు. ముఖ్యంగా గీతూ రాయల్, రేవంత్ ను టార్గెట్ చేస్తూ మరింతగా రెచ్చిపోయింది.

తర్వాత చంటి లోనీ తప్పులను కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేసింది. ఇక హౌస్‌మేట్స్ అంద‌రూ కూర్చొని ప‌రిష్క‌రించుకుందాం అంటూ రిక్వెస్ట్ చేయ‌డంతో గీతూ రాయ‌ల్, చంటి వెళ్లిపోయారు. గీతూ.. రేవంత్ బిహేవియర్ మారాలి, ఇలానే ఉంటే హౌస్‌లో నుండి వెళ్లిపోతాడు అంటూ అర్జున్‌, ఆదిరెడ్డిల‌తో అంటుంది. అంతేకాదు రేవంత్ బయటకు వెళ్ళిపోతేనే ఆయన కెరీర్ బాగుంటుంది అన్నట్లుగా తెలిపారు. ఇక రేవంత్ పక్కకు వెళ్లి బాధపడుతూ బిగ్ బాస్ ఏంటి రచ్చ అంటూ బాధపడిపోయారు.

- Advertisement -