బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. మంగళవారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులను ప్రవేశపెట్టిన బిగ్ బాస్ దానికి బుధవారం కూడా కంటిన్యూ చేశారు.
మొదటగా ఫైమా తల్లి షాహీదా వచ్చింది. తల్లిని చూడగానే ఫైమా గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టింది. ఫైమా తల్లి అందరితో సరదాగా గడిపింది. బయట అందరూ తనని ఫైమా వాళ్ల అమ్మ అంటూ గుర్తుపట్టి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆనందపడింది ఫైమా తల్లి. ఇక రోహిత్ వాళ్ళ అమ్మ వెనక నుంచి వచ్చి రోహిత్ కళ్లు మూసి సర్‌ప్రైజ్ చేసింది. తల్లిని చూడగానే రోహిత్ ఏడ్చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇటీవలే హౌజ్ నుంచి బయటకి వెళ్లిపోయిన తన భార్యని తలుచుకున్నాడు.
శ్రీసత్య ….తండ్రి, తల్లి వచ్చారు. శ్రీసత్య తల్లి వీల్ చైర్ లో వచ్చింది. తండ్రిని, వీల్‌చైర్‌లో ఉన్న తల్లిని చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసి ఇద్దర్ని హగ్ చేసుకుంది. తల్లికి గోరుముద్దలు తినిపించింది. వాళ్ళు వెళ్ళిపోయాక తన తల్లికి చికిత్స చేయించడానికి డబ్బులు లేవు అని బాధపడింది. తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులను ఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్, లూప్ అనే గేమ్ ఆడించాడు. ఈ గేమ్ లో ఇంటిసభ్యులు ఒకరినొకరు ఆటపట్టించారు.
ఇవి కూడా చదవండి..