BB6..ఎపిసోడ్ 30 హైలైట్స్

111
bb6
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 29 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇనయ హైలైట్‌గా నిలిచింది. ప్రతివారం మాదిరిగా కాకుండా ఈవారం నామినేషన్స్ డిఫెరెంట్‌గా సాగింది. ఇప్పటివరకూ జంటగా ఆడిన మెరీనా-రోహిత్‌లు ఇకపై ఎవరి ఆట వాళ్లు ఆడతారని చెప్పిన బిగ్ బాస్ అన్నట్లుగానే వారితోనే నామినేషన్స్ మొదలుపెట్టించారు.

మీ ఇద్దరిలో ఎవరు నామినేట్ అయి ఎవరు సేవ్ అవుతారో తెల్చుకోవాలని చెప్పగా మెరీనా.. రోహిత్ కోసం త్యాగం అయ్యింది. దీంతో రోహిత్ సేవ్ అయ్యి.. మెరీనా నామినేషన్స్‌లో నిలిచింది. రెండో నామినేషన్స్‌లో భాగంగా.. శ్రీహాన్, ఇనయలను జంటగా పిలిచారు బిగ్ బాస్. నేను రాను బిగ్ బాస్ ఆమెతో నా వల్ల కాదు అంటూ శ్రీహాన్ చెప్పగా నాకు అర్హత లేదంటున్నావ్ కదా.. అయ్యి చూపిస్తా అని తెలిపింది ఇనయ.

గత నామినేషన్స్‌లో ఫ్రెండ్స్ కోసం ప్రాణం ఇస్తానంటే.. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.. అని వెటకారం చేసి శ్రీహాన్.. ఇప్పుడు అవసరం పడేసరికి ఇనయని నువ్ కూడా నా ఫ్రెండ్ అని అనేశాడు. ఆ మాటతో ఇనయ.. నువ్వు ఫ్రెండ్ షిప్ కోసం మాట్లాడుతున్నావా? వాడు అంటే తెగ యాక్ట్ చేశావ్.. ఇప్పుడు అవసరం పడేసరికి ఫ్రెండ్ అంటున్నావ్.. గ్రేట్ యాక్టర్‌వి వావ్ అనేసింది ఇనయ. చివరికి శ్రీహాన్ ఎంతకీ నామినేట్ కావడానికి ఒప్పుకోకపోవడంతో.. ఇనయ సెల్ఫ్ నామినేట్ అయ్యి శ్రీహాన్‌కి షాక్ ఇచ్చింది.

- Advertisement -