బిగ్ బాస్ 6…కెప్టెన్‌గా బాలాదిత్య

101
BB6
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. 5వ రోజు పూర్తికాగా ఇక ఈ సీజన్‌ ఫస్ట్ కెప్టెన్‌గా ఎన్నికయ్యారు బలాదిత్య. కెప్టెన్సీ కోసం కెప్టెన్సీ బండి అనే టాస్క్ నడిచింది. ఈ టాస్క్ లో వాటర్‌లో కీస్‌ ఉంటాయి. నీళ్లలో తలముంచి నోటితో ఆ కీస్‌ తీసుకుని పక్కనే ఉన్న బాక్స్ ని ఓపెన్‌ చేయాలి. ఆ బాక్స్ లో ఒక కారు నెంబర్‌ ఉంటుంది. ఆ నంబర్ కి తగ్గట్టు మరో టబ్‌లో ఉన్న నెంబర్స్ వెతికి తనకు కేటాయించిన కారు నెంబర్‌ని ఆర్డర్ లో సెట్ చేయాలి. ఈ టాస్క్ కి ఫైమా సంచాలక్‌గా వ్యవహరించింది.

అయితే ఈ టాస్క్ లో గీతూ రాయల్ ముందుగా టాస్క్ పూర్తి చేయగా ఆ తర్వాత బాలాదిత్య పూర్తి చేశాడు. అయితే గీతూ సరిగ్గా ఆడలేదు, తన గేమ్ చెల్లదు అని బాలాదిత్య విన్ అయ్యాడని ఫైమా తీర్పు ఇచ్చింది. మిగిలిన కంటెస్టెంట్స్ కూడా బాలాదిత్యనే విన్నర్ అని చెప్పడంతో గీతూకి, ఫైమాకి మధ్య గొడవ జరిగింది. మొత్తంగా ఫస్ట్ వీక్ బాలాదిత్య కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

ప్రతి వారం కెప్టెన్సీ తో పాటు వరస్ట్ పర్ఫార్మర్ ని కూడా ఎన్నుకుంటారన్న సంగతి తెలిసిందే. దీంతో గీతూ యాటిట్యూడ్ కి, గీతూ చేసే హడావిడికి హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా కలిసి గీతూని ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. దీంతో తనని జైల్లో పెట్టారు.

- Advertisement -