బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 17 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మూడోవారం నామినేషన్స్ సందర్భంగా జరిగిన రచ్చ 17వ ఎపిసోడ్‌లోనూ కొనసాగింది. నేహా చౌదరి నామినేషన్స్‌లో రేవంత్‌తో జరిగిన గొడవపై హర్ట్ అయి కంటతడి పెట్టేసింది. రాణి శ్రీ సత్య మరోసారి తాను ఇక్కడికి వచ్చింది మనీ కోసం.. ఫేమ్ కోసం నా నుంచి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేసినా నుంచి ఏం రాదు అని తెలిపింది.
ఇక ఈవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా.. ఇంటి సభ్యుల్ని పోలీసులు, దొంగలుగా రెండు గ్రూప్‌లు చేశారు. ఆదిరెడ్డి, మెరీనా, శ్రీ సత్య, ఫైమా, ఇనయ, చంటి, ఆదిత్య, రోహిత్, రాజ్‌లు కాగా.. దొంగల టీం సభ్యులుగా రేవంత్, ఆరోహి, సుదీప, వసంతి, నేహ, కీర్తి, శ్రీహాన్, సూర్య, అర్జున్‌లు ఉన్నారు. గీతు అత్యాశ ఉన్న వ్యాపారస్తులుగా గీతుని సెలెక్ట్ చేశారు. పోలీస్‌ల హెడ్ గా ఆదిరెడ్డి.. దొంగల హెడ్‌గా సూర్యని ఎంపిక చేశారు. పోలీసులు అడవిలోకి వెళ్లి అక్కడ ఉన్న వస్తువుల్ని దొంగిలించాలి.. అలాగే పోలీసులు కాపాడుకోవాలి.. టాస్క్ ఇచ్చారు.
పోలీస్ బాస్‌గా ఉన్న ఆదిరెడ్డి దొంగలు మాదిరిగానే మనం కూడా బొమ్మల్ని దాచిపెట్టుకోవాలని.. వాళ్లని బోల్తా కొట్టించాలని చెప్పాడు. ఇక ఆరోహి అయితే పోలీస్‌లకు ఇన్ఫార్మర్గా పనిచేస్తానని.. దొంగల టీంలో ఉన్న ఫైమాతో డీల్ కుదుర్చుకుంది. బొమ్మల విషయంలో శ్రీహాన్-ఇనయ మధ్య గట్టిగొడవే అయ్యింది. నేహ.. ఇనయ మధ్య గొడవ అయ్యింది.
గీతు అయితే.. దొంగల దగ్గర కొనుక్కోవాలని టాస్క్‌లో ఉంటే.. వాళ్ల దగ్గర కొట్టేసి.. ఇది నా గేమ్ నా ఇష్టం అని అడ్డంగా మాట్లాడుతూ యాటిట్యూడ్ చూపించింది. ఈమె రూల్స్ బ్రేక్ చేసి అందర్నీ రూల్స్ ఫాలో కావాలని నీతులు చెప్పింది.శ్రీ సత్య ..గీతూపై మండిపడింది. చివరగా రెడ్ ట్యాగ్ ఉన్న బొమ్మలు మాత్రమే కొనుగోలుకు అవకాశం ఉండటంతో రేవంత్ బుర్ర ఉపయోగించి.. టవల్లో నుంచి దారాలను తీసి రెడ్ ట్యాగ్స్గా బొమ్మలకు చుట్టాడు.