బిగ్ బాస్ 6..ఈసారి హౌస్‌లోకి 21 మంది

78
bigg boss 6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా ఈ సారి హౌస్‌లోకి 21 మంది వెళ్లారు. తొలుత హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు నాగ్. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది.

తొలుత కార్తీక దీపం ఫేమ్ కీర్తి భట్ ఎంట్రీ ఇవ్వగా తర్వాత నువ్వు నాకు నచ్చవు సినిమాలో పింకీగా చేసిన ఆర్టిస్ట్ సుదీప ఎంట్రీ ఇచ్చింది. ఇక మూడో కంటెస్టెంట్ గా యూట్యూబ్, సీరియల్స్ తో ఫేమస్ అయిన సిరి హనుమంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ ఎంట్రీ ఇచ్చాడు. నాలుగో కంటెస్టెంట్ గా యాంకర్ నేహా చౌదరి, ఐదో కంటెస్టెంట్ గా అందరికి సుపరిచితుడు అయిన జబర్దస్త్ చంటి వచ్చాడు.

ఆరో కంటెస్టెంట్ గా శ్రీసత్య, ఏడో కంటెస్టెంట్ గా అర్జున్ కళ్యాణ్, ఎనిమిదో కంటెస్టెంట్ గా గలాటా గీతూ వచ్చింది. తొమ్మిదో కంటెస్టెంట్ గా డ్యాన్సర్ అభినయశ్రీ, 10,11 కంటెస్టెంట్స్ గా రోహిత్,మరీనా, 12వ కంటెస్టెంట్ గా హీరో బాలాదిత్య, 13వ కంటెస్టెంట్ గా వాసంతి కృష్ణ, 14వ కంటెస్టెంట్ గా ఆర్టిస్ట్ షా, 15వ కంటెస్టెంట్ గా ఆర్జీవీ హీరోయిన్ ఇనయా సుల్తానా, 16వ కంటెస్టెంట్ గా ఆర్జే సూర్య, 17వ కంటెస్టెంట్ గా ఫైమా, 18వ కంటెస్టెంట్ గా ఆదిరెడ్డి, 19వ కంటెస్టెంట్ గా నటుడు రాజశేఖర్, 20వ కంటెస్టెంట్ గా ఆరోహి రావు, చివరగా ప్రముఖ సింగర్ రేవంత్ ఎంట్రీ ఇచ్చారు.

- Advertisement -