బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 5వ వారంలోకి ఎంటరైంది. ఇక 5వ వారం సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మళ్లీ వేడిని రాజేసింది. ఇక శివాజీని హౌస్ మేట్ స్ధానం నుండి తప్పించి కంటెస్టెంట్‌గా మార్చడంతో నామినేషన్స్‌లో ఒక్కొక్కరి మీద రెచ్చిపోయి ఇచ్చిపడేశాడు.
ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్‌లో ఇద్దరిని మీరు నామినేట్ చేయాల్సి ఉంటుందని,శివాజీ కూడా నామినేషన్స్‌లో పాల్గొంటారని చెప్పారు. మీ ఫేస్ ఉన్న కత్తిని కంటెస్టెంట్ల మెడలో ఉన్న బోర్డుకి గుచ్చాలన్నాడు. అయితే తేజ డైరెక్ట్‌గా నామినేట్ కావడంతో అతన్ని ఎవరూ నామినేట్ చేయాల్సిన అవసరం లేదంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ముందుగా శివాజీకి అవకాశం ఇచ్చాడు. అమర్‌దీప్‌ను నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. మొదటి నుంచి మాట్లాడుకొని మీరు ఆడుతున్న విధానం నాకు రెండో రోజే తెలిసిపోయిందని తెలిపాడు.
దీనికోసం ఓ కథను కూడా చెప్పారు. నిన్న నువ్వు చేయి ఎత్తినదానికి కూడా నీ దగ్గర రీజన్ లేదు.. నేను ఎక్కడా పక్షపాతంగా లేను.. ఉంటే నేను ప్రియాంకకి 10 కాయిన్స్ ఇవ్వను అంటూ శివాజీ తన పాయింట్ క్లియర్‌గా చెప్పాడు. దీనికి సమాధానంగా అమర్ కూడా యావర్, ప్రశాంత్‌కి ఎక్కువ ఎందుకిచ్చారన్నా.. అదే పక్షపాతం అన్నాడు. ఎందుకంటే వాళ్లకి అన్యాయం జరిగిందని ఇచ్చా.. అంటూ శివాజీ అనడంతో అమర్ దండం పెట్టి ఏం చెప్పాలో తెలీక కాసేపు సైలెంట్‌గా ఉన్నాడు. తర్వాత వీరిద్దరి మధ్య వాడివేడిగా డిస్కషన్ జరిగింది.
Also Read:కోమటిరెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్…
ఇక తర్వాత వచ్చిన ప్రియాంక… శివాజీని నామినేట్ చేసేసింది. అస్తమాను గ్రూప్ గ్రూప్ అంటున్నారు. మేము గ్రూప్‌గా ఆడామని మీరు ఎలా అంటారు అని ప్రియాంక అంది. నేను నిన్ను అనలేదు కదమ్మా.. నీ పేరు చెప్పానా కాదు కదా.. అంటూ శివాజీ పంచ్ ఇచ్చాడు. సరే అవన్నీ ఎందుకు నీ పాయింట్ నువ్వు చెప్పావ్ రా వచ్చి కత్తి దింపు అంటూ శివాజీ అన్నాడు. ఇక గౌతమ్.. తన ఫస్ట్ నామినేషన్ అమర్‌ని ఎన్నుకున్నాడు. నువ్వు ఓటమిని తీసుకోకపోవడం నాకు నచ్చలేదు.. అంటూ కారణం చెప్పాడు. తర్వాత శివాజీని చెప్పాడు. స్మైలింగ్ ఛాలెంజ్ గేమ్‌లో తేజ నన్ను బెల్టుతో కొడుతుంటే మీరు ఒక్క మాట కూడా అనకపోవడంనాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నానని తెలిపాడు.
శుభశ్రీ.. అమర్‌ని ఫస్ట్ నామినేట్ చేసింది. గాలా ఈవెంట్‌లో నేను గెలిచిన టైమ్‌లో మీరు అది పక్షపాతంగా తీసుకున్న నిర్ణయమని చెప్పడం కరెక్ట్ కాదు అని తెలిపారు. యావర్.. అమర్,ప్రియాంకలను నామినేట్ చేశారు.