బిగ్ బాస్ 5: ఈ వారం లోబో ఎలిమినేట్..!

76

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5 విజయవంతంగా ముందు సాగుతోంది. 19మందితో షో ప్రారంభం కాగా, ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో ఆరుగురు మ‌హిళా కంటెస్టెంటే. ఇక ఎనిమిదో వారం నామినేష‌న్ ప్ర‌క్రియ చాలా ఎమోష‌న‌ల్‌గా సాగ‌గా, రవి, లోబో, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. ఇక వీకెండ్ రావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రతి వారం ఒకొక్కరు చొప్పున ఎలిమినేట్ అవుతూ ఉంటే గేమ్ మరింత ఆసక్తికరంగా మారుతూ వస్తోంది. కొన్ని సార్లు స్ట్రాంగ్ అనుకున్న వారు ఎలిమినేట్ అవుతుంటే.. కొన్ని సార్లు వెళ్తారు అనుకున్న వారే వెళ్లి పోతున్నారు. అయితే ఎలిమినేషన్‌కు సంబంధించిన విషయం ఒక రోజు ముందుగానే ప్రతి వారం లీక్ అవుతుంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎపిసోడ్‌కు ముందు రోజే ఎలిమినేట్ అయ్యింది ఎవరు అనే విషయం లీక్ అయ్యింది.

తాజాగా ఈ రోజు బిగ్ బాస్ నుండి లోబో ఎలిమినేట్ కాబోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది.ఆయ‌న ఇప్ప‌టికే ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు కూడా వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తుంది. లోబో దాదాపు వారం రోజులు సీక్రెట్ రూమ్‌లో గడిపిన తర్వాత రీసెంట్‌గా హౌస్‌లో గ్రాండ్‌ గా రీఎంట్రీ అయ్యాడు. కానీ మరింత డౌన్ అయినట్టుగా కన్పిస్తోంది. లోబోకు కూడా ఇంటిపై గుంజుతుందని అనిపస్తోంది.. అతడి భార్య గర్బవతిగా ఉన్నారు. కనుక ఈ సమయంలో ఆయన వెళ్లడం మంచిది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లోబో ఎలిమినేట్ అయినా కూడా ఒక మంచి గుర్తింపును అయితే దక్కించుకున్నాడు అనడంలో సందేహం లేదు. మరి లోబో ఎలిమినేట్ అయ్యాడా.. లేదా.. అనేది ఈరోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే.