బిగ్‌బాస్‌ 5: ఈవారం నామినేషన్‌లో 9 మంది..

67
Bigg Boss 5

బిగ్‌బాస్‌ 5 తెలుగు నాలుగు వారాలు పూర్తి చేసుకొని 5వ వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం వచ్చిందంటే చాలు.. అప్పటి వరకు పచ్చగా ఉన్న బిగ్ బాస్ హౌజ్ ఒక్కసారిగా మండిపోతుంది. స్నేహితులుగా ఉన్న వాళ్లే ఆ ఒక్కరోజు మాత్రం శత్రువులు అయిపోతారు. ఎందుకంటే అది బిగ్ బాస్ హౌజ్ కాబట్టి. తొలి నాలుగు వారాలు నామినేషన్స్‌లోకి రాని షణ్ముఖ్ జస్వంత్‌ను 5వ వారం ఏకంగా 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ చేసారు. బిగ్ బాస్ 5 తెలుగు 5వ వారం నామినేషన్స్‌లో ఏకంగా 9 మంది ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ వారం నామినేషన్స్‌లో.. లోబో, సన్నీ, విశ్వ , హమీదా, మానస్, ప్రియ, జెస్సీ,, యాంకర్ రవి , షణ్ముఖ్ జస్వంత్ లు ఉన్నారు. ఈ నామినేష‌న్‌లో అత్యధికంగా షణ్ముఖ్‌ను నామినేట్‌ చేశారు. జెస్సీ తప్ప అందరు అబ్బాయిలు షణ్ముఖ్‌ను నామినేట్‌ చేయడం గమనార్హం. ఈ దెబ్బకు షాకైన షణ్ముఖ్‌ ఈరోజు కోసమే ఇంతకాలం వెయిట్‌ చేశానన్నాడు. ఇప్పుడు చూస్తార్రా నా గేమ్‌ అంటూ ఒక్కసారిగా హైపర్‌ అయిపోయాడు.