బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా ఏడోవారం పూర్తి చేసుకోగా ఏడోవారంలో ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు ప్రియా. ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ కావడంతో కన్నీళ్లు ఆపుకోలేక పోయింది ప్రియాంక. చివరగా ఆనీ, ప్రియ ఎలిమినేషన్స్‌లో ట్విస్ట్ పెట్టి ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారా? అని అనుమానం కలిగించేలా కొద్ది సేపు డ్రామా ప్లే చేయించాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న పెట్టెలో ఇద్దరూ మాయం అవ్వడంతో ఇంటి సభ్యులు షాక్ తిన్నారు.
ఇక ప్రియ ఎలిమినేట్ అయి ఉంటుందని అనుమాన పడ్డ ప్రియాంక.. వెక్కి వెక్కి ఏడచ్చింది. అయిఏ కాసేపటి తరువాత పవర్ రూం నుంచి ఆనీ మాస్టర్ రావడంతో ప్రియ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగ్.తొలుత గార్డెన్ ఏరియాలో పదకొండు పిల్లలోను పెట్టాడు. కానీ ఇంట్లో ఉన్నది పదమూడు మంది. అంటే మొదటి రౌండ్‌లో ఇద్దరు పక్కకు తప్పుకుంటారన్న మాట. బజర్ మోగిన తరువాత పరిగెత్తి పిల్లోలను పట్టుకోవాలని నాగ్ చెప్పాడు. మిగతా వాళ్ల దగ్గరి నుంచి బతిమిలాడి పిల్లోలను తీసుకోవచ్చు. లేదా లాక్కోవచ్చు. ఏదైనా చేయోచ్చు అని తెలిపాడు.
అయితే కాజల్, సిరిలకు పిల్లోలు దొరకలేదు. కానీ సిరి కోసం షన్ను తన పిల్లోను ఇచ్చాడు. అలా మొదటి రౌండ్ ముగిసే సరికి కాజల్, షన్ను అవుట్ అయ్యారు. రెండో ఆటగా చలనచిత్ర వీర అంటూ ఆడించాడు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే.. పరిగెత్తి గంటను కొట్టి సమాధానాలు చెప్పాలి. అలా తప్పు చెబితే రెండో దశ నుంచి తప్పుకుంటారని చెప్పాడు.
ఇంద్ర సినిమాలో చిరంజీవి పాత్రల పేర్లు సరిగ్గా చెప్పలేక జెస్సీ అవుట్ అయ్యాడు. 100 పర్సెంట్ లవ్ సినిమాలో తమన్నా కారెక్టర్ పేరు చెప్పలేక ప్రియ అవుట్ అయింది. అలా ఈ టాస్క్‌లో తప్పు సమాధానాలు చెప్పి మానస్, ప్రియాంక కూడా పక్కకు తప్పుకున్నారు. ఆ తరువాత మిసెస్ ప్రభావతి దయతో లోబో సేఫ్ అయ్యాడు. లోబోకు మాత్రమే కోడి కూత రావడం, మిగతా కంటెస్టెంట్లకు రకరకాల జంతువలు శబ్దాలను ఇచ్చింది. మిగిలిన ఆనీ, విశ్వ, శ్రీరామ, సిరి, సన్నీలకు మ్యూజికల్ చైర్ ఆటనుపెట్టాడు. ఇందులో మొదటి పాటకే సిరి అవుట్ అయింది. రెండో సారికి సన్నీ పక్కకు జరిగిపోయాడు.
అలా చివరకు శ్రీరామచంద్ర, విశ్వ, ఆనీలు మిగిలారు. తాను ఓ కలర్ పేరు చెబుతాను.. ఇంట్లోంచి వెళ్లి ఆ కలర్ వస్తువులను పట్టుకుని రావాలని నాగ్ తెలిపాడు. ఈ టాస్క్‌లో శ్రీరామచంద్ర ఓడిపోయాడు. చివరకు ఆనీ, విశ్వలు మిగిలితే టోపీ పోటీ అని టాస్క్ పెట్టాడు. అయితే ఆనీ, విశ్వలకు సపోర్ట్ చేసేవారు విడివిడిగా ఉండమన్నాడు.